Ad Code

వాట్సాప్ లో మల్టీ డివైజ్ సపోర్ట్ ?


వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చే ముందు బీటా యూజర్లపై టెస్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా మల్టీ-డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ మొదటగా బీటా టెస్టర్లకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఫీచర్‌ను ఎనిమిది నెలలకు పైగా టెస్ట్ చేసిన వాట్సాప్ తాజాగా దీనిని రెగ్యులర్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు మల్టీ డివైజ్ సపోర్ట్ తో ఏకకాలంలో 5 డివైజ్‌ల్లో వాట్సాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. మల్టీ డివైజ్ సపోర్ట్ ద్వారా వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్‌ల వంటి నాలుగు ఇతర డివైజ్‌ల్లో వాట్సాప్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోన్ అవసరం లేకుండానే మీరు వాట్సాప్ అకౌంట్ ను యాక్సెస్ . ఒకవేళ మీ ఫోన్‌కు వరుసగా 14 రోజులకు పైగా ఇంటర్నెట్ కనెక్షన్ లేనట్లయితే, లింక్ అయిన డివైజ్‌లు డిస్‌కనెక్ట్ అవుతాయి. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లో web.whatsapp.com ని ఓపెన్ చేసి తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్ లో కనిపిస్తున్న త్రీ-డాట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత మీరు 'లింక్డ్ డివైజెస్'ను ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఐఫోన్ యూజర్లకు వాట్సప్ సెట్టింగ్స్ లో 'లింక్డ్ డివైజెస్' ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. లింక్డ్ డివైజెస్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇది మిమ్మల్ని కోడ్‌ని స్కాన్ చేయమని అడుగుతుంది. web.whatsapp.comలో కనిపించే కోడ్‌ని స్కాన్ చేయాలి. ఈ సమయంలో ఫోన్, ల్యాప్‌టాప్ రెండూ ఇంటర్నెట్ కనెక్షన్‌కు యాక్సెస్ ఉండేలా చూసుకోవాలి. కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత, ల్యాప్‌టాప్ లో వాట్సాప్ మెసేజెస్ రావడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత వాట్సాప్ వెబ్ మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఫోన్ తో పని లేకుండానే వర్క్ అవుతుంది. మీరు మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేసినా లింక్డ్ ల్యాప్‌టాప్ లో వాట్సాప్ వర్క్ అవుతూనే ఉంటుంది. అన్ని మెసేజ్ లు ల్యాప్‌టాప్ లో లోకల్ గా స్టోర్ అవుతాయి. అయితే, కొన్ని మెసేజ్ లు వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్‌కు సింక్ అవ్వవు. కొన్నిసార్లు, వాట్సాప్ మీకు ఫుల్ మెసేజ్ హిస్టరీని చూడటానికి మీ ఫోన్‌లో చెక్ చేయమని కూడా అడుగుతుంది. ప్రైమరీ ఫోన్ తో పోలిస్తే, వాట్సాప్ లింక్డ్ డివైజ్ లలో కొన్ని ఫీచర్‌లు సపోర్ట్ చేయవు. ప్రైమరీ డివైజ్ iPhone అయితే లింక్డ్ డివైజ్‌ల్లో చాట్‌లను క్లియర్ చేయడం లేదా డిలీట్ చేయడం సాధ్యపడదు. ఫోన్‌లో చాలా పాత వెర్షన్ వాట్సాప్‌ని ఉపయోగిస్తున్న యూజర్లకు మీరు మెసేజ్ చేయడం లేదా కాల్ చేయడం కుదరదు. అలాగే, టాబ్లెట్‌లకు సపోర్ట్ లేదు. లింక్డ్ డివైజ్‌ల్లో లైవ్ లొకేషన్ చూడటం కుదరదు. లింక్డ్ డివైజ్‌ల్లో బ్రాడ్ కాస్ట్ లిస్ట్ క్రియేట్ చేయడం లేదా వ్యూ చేయడం సాధ్యపడదు. వాట్సాప్ వెబ్ నుంచి లింక్ ప్రివ్యూలతో మెసేజ్‌లు సెండ్ చేయడం వీలు కాదు.

Post a Comment

0 Comments

Close Menu