Ad Code

పేటీఎం నుంచి కొత్త ఫీచర్...!


పేటీఎం వినియోగదారులు, వ్యాపారుల కోసం 'ట్యాప్ టు పే'  ఫీచర్‌ను ప్రారంభించింది. వినియోగదారులు వారి పేటీఎం  రిజిస్టర్డ్ కార్డ్ ద్వారా కేవలం PoS మెషీన్‌లో వారి ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా తక్షణ చెల్లింపులను చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫోన్ లాక్‌లో ఉన్నా, మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా పేమెంట్స్ చేయొచ్చు. పేటీఎం ఆల్ ఇన్ వన్ PoS పరికరాలు, ఇతర బ్యాంకుల PoS మెషీన్‌ల ద్వారా చెల్లించే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు పేటీఎం 'ట్యాప్ టు పే' సర్వీస్ అందుబాటులో ఉంది. ట్యాప్ టు పే సర్వీసుతో, ఎంచుకున్న కార్డ్‌లోని 16-అంకెల పర్మనెంట్ అకౌంట్ నెంబర్  అంటే పాన్ కార్డ్ నెంబర్‌ను సురక్షిత లావాదేవీ కోడ్ లేదా డిజిటల్ ఐడెంటిఫైయర్‌గా మార్చడానికి పేటీఎం దాని బలమైన సాంకేతికతను ఉపయోగిస్తుంది. డిజిటల్ ఐడెంటిఫైయర్ వినియోగదారు కార్డ్ వివరాలు వినియోగదారు వద్ద మాత్రమే ఉండేలా చూస్తుంది. ఏ థర్డ్ పార్టీ పేమెంట్ ప్రాసెసర్‌తో ఈ వివరాలను పంచుకోదు పేటీఎం. ఒక వినియోగదారు రిటైల్ అవుట్‌లెట్‌ను సందర్శించినప్పుడు, వారు లావాదేవీ ద్వారా వారి కార్డ్ వివరాలను పంచుకోనవసరం లేకుండా కేవలం PoS పరికరం పై ట్యాప్ చేసి పేమెంట్ చేయొచ్చు. తాజా ఫీచర్‌తో, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్ ఉన్న కార్డ్ మెషీన్‌లలో చెల్లింపులు చేయవచ్చు. కార్డ్‌ల లావాదేవీ చరిత్రపై ఒక విభాగాన్ని అందించే పేటీఎం యాప్‌లోని డెడికేటెడ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా కార్డ్‌లను మేనేజ్ చేయొచ్చు. ఏ క్షణంలోనైనా కొన్ని సాధారణ దశల్లో ప్రాథమిక టోకనైజ్డ్ కార్డ్‌ని కూడా మార్చవచ్చు. డ్యాష్‌బోర్డ్ వినియోగదారులు అవసరమైనప్పుడు కార్డ్‌ని మార్చడానికి లేదా డీ-టోకనైజ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. పేటీఎం యూజర్లు ట్యాప్ టు పే ఫీచర్ వాడుకోవడానికి పేటీఎం యూజర్లు ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి. ముందే సేవ్ చేసి ఉన్న కార్డుల జాబితా నుంచి ఓ కార్డ్ సెలెక్ట్ చేయాలి. ట్యాప్ టు పే ఫీచర్ పైన క్లిక్ చేసి Add New Card క్లిక్ చేయాలి. ఆ తర్వాతి స్క్రీన్‌లో కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అంగీకరించాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. మీ కార్డు యాక్టివేట్ అవుతుంది. మీరు ట్యాప్ టు పే ఫీచర్ వాడుకోవచ్చు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల UPI 123PAY సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫీచర్ ఫోన్ యూజర్లు మొబైల్ డేటా లేకపోయినా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడానికి, ఎల్‌పీజీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu