Ad Code

ఆన్‌లైన్‌లో అద్దెకు ఏసీ !


ఏసీ అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఏసీలను అద్దెకు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. అద్దె ఇళ్లల్లో ఉండేవారికి ఈ సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది. ఇల్లు మారిన ప్రతీసారి ఏసీ మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం వేసవిలో మాత్రమే ఏసీ వాడుతారు కాబట్టి అద్దెకు తీసుకుంటే చాలు. ఆన్‌లైన్‌లో రెంటోమోజ, రెంటోల్కో, సిటీఫర్నిష్, ఫెయిర్‌నెట్ లాంటి సంస్థలు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, నోయిడా ఇతర నగరాల్లో ఈ సేవల్ని అందిస్తున్నాయి. కేవలం నెలకు రూ.1,100 నుంచి ఏసీలు అద్దెకు లభిస్తాయి. రెంటోమోజో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, నోయిడా, గుర్గావ్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ సేవల్ని అందిస్తున్నాయి. నెలకు రూ.1,399 నుంచి అద్దె మొదలవుతుంది. 1 టన్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్‌ని రూ.1,949 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. రూ.1,500 ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌తో పాటు వెబ్‌సైట్ కూడా ఉంది. సిటీఫర్నిష్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో సేవల్ని అందిస్తోంది. 1 టన్ విండో ఏసీ అద్దెకు తీసుకోవాలంటే నెలకు రూ.1,069 చెల్లించాలి. రూ.1,000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాలి. రూ.2,749 రీఫండబుల్ డిపాజిట్ కూడా ఉంటుంది. 1 టన్ స్ప్లిట్ ఏసీ అద్దె తీసుకుంటే నెలకు రూ.1,249 చెల్లించాలి. రూ.1,500 ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాలి. రూ.2,799 రీఫండబుల్ డిపాజిట్ కూడా ఉంటుంది. ఫెయిర్‌నెట్ ప్లాట్‌ఫామ్‌లో నెలకు రూ.1,375 అద్దె చెల్లించి 1.5 టన్ విండో ఏసీ అద్దెకు తీసుకోవచ్చు. మొత్తం ప్యాకేజీ కలిపి ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇతర ఛార్జీలు లేకుండా మొత్తం ప్యాకేజీ కలిపే ఉంటుంది. రెంటోల్కో ప్లాట్‌ఫామ్‌లో కూడా ఏసీలు అద్దెకు లభిస్తాయి. నెలకు రూ.1,299 నుంచి రూ.1,599 మధ్య అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కనీసం మూడు నెలలు అద్దెకు తీసుకోవచ్చు. 1.5 టన్ విండో ఏసీకి రూ.1,532 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. వన్ టైమ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు రూ.500 చెల్లించి ఒక నెలకు ఏసీ అద్దెకు తీసుకోవచ్చు. ఏసీ అద్దెకు తీసుకునే ముందు ఓసారి నియమ నిబంధనలన్నీ పూర్తిగా తెలుసుకోవాలి. 

Post a Comment

0 Comments

Close Menu