Ad Code

యాపిల్ ప్రొడక్ట్‌లు కొనాలనుకుంటే కాస్త ఆగండి !


యాపిల్ గత వారం ఒక ప్రకటన చేసింది. మార్చి 8న ప్రెస్ ఈవెంట్ నిర్వహిస్తామని పేర్కొంది. దానిని బట్టి చూస్తే కంపెనీ నుంచి కొత్తగా రాబోయే విషయమేంటో స్పష్టత లేదు. ఇప్పటికే లీక్ అయిన సమాచారం మేరకు కొత్త ఫోన్ లాంచింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే iPhone SE అప్‌గ్రేడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు కంపెనీ ప్రస్తుతం నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ ను రెడీ చేసేందుకు పని చేస్తున్నట్లుగా తెలిపింది. హై ఎండ్ మ్యాక్ మినీ, 13ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో, కొత్త ఎక్స్‌టర్నల్ డిస్ ప్లే వంటి ఫీచర్లు రానున్నాయి. అందుకే ప్రస్తుతం యాపిల్ ప్రొడక్ట్ కొనాలనుకుంటే కాస్త సమయం వేచి ఉండాలి మరి. iPhone SE ఎల్లప్పుడూ “బడ్జెట్” ఫోన్ గా చూస్తుంటారు. కొత్త iPhone SE త్వరలో ల్యాండింగ్ అవుతుందని తెలుస్తుంది, కాబట్టి అత్యవసరంగా వేరే దానితో రీప్లేస్ చేయాలని ప్రయత్నించొద్దు. మరి కొద్ది నెలల్లో ఐప్యాడ్ ఎయిర్.. ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తుందనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. వాడుకలో ఉన్న M1 మ్యాక్ మినీ కాకుండా మ్యాక్ మినీని లాంచ్ చేసేందుకు యాపిల్ సిద్ధమైంది. 2020లో లాంచ్ అయిన పాత మోడల్ పక్కకుపెట్టి కొత్త దానితో మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ప్రొఫెషనర్ యూజర్లకు ఇది బాగా యూజ్ అవుతుంది. 13-inch MacBook Pro ఇప్పుడు M1 ప్రాసెసర్ తో వస్తుందనుకోవద్దు. ఒకసారి 13 ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో లాంచ్ చేసిన తర్వాత యాపిల్ 14 అంగుళాల లేదా 16అంగుళాల మ్యాక్ బుక్ లాంచ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu