Ad Code

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లపై రష్యా కోర్టు కీలక తీర్పు


రష్యా దేశంలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను మాస్కో కోర్టు నిషేధించింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువడినట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. విద్వేషాన్ని రెచ్చగొట్టే, అతివాద కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయని గుర్తించి మాస్కో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు మెటా సంస్థకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు రష్యాను వీడుతున్న సమయంలో మాస్కో కోర్టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను బ్యాన్ చేయడం ఆ దేశానికి మరో షాక్ అని చెప్పవచ్చు. యుద్ధం నేపథ్యంలో దేశంలో పలు సంస్థలపై నిషేధం ఉంది. ఇది ఆర్థిక సమస్యలను మరింతగా పెంచుతుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. మెటా సంస్థ నిర్ణయాలు, వారికి చెందిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్టులు రష్యా, దేశ ఆర్మీకి వ్యతిరేకంగా ఉన్నాయని ఎఫ్‌ఎస్‌బీ ప్రతినిధి ఇగోర్ కోవెలెవ్‌స్కై మాస్కోలోని ట్వెర్‌స్కోయ్ జిల్లా కోర్టుకు విన్నవించారు. మెటా సంస్థ కార్యకలాపాలను దేశంలో నిషేధించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను బ్యాన్ చేస్తూ తీర్పిచ్చింది. ఇదివరకే పలు కంపెనీలు రష్యా నుంచి వెళ్లిపోగా, మరో రెండు సోషల్ మీడియా మాద్యమాలు రష్యాలో కొంతకాలం వరకు ఇన్ యాక్టివ్ కానున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu