Ad Code

ఓఎన్జీసీకి రిగ్గులు సరఫరాలో మేఘా రికార్డు


ఓఎన్జీసీకి అత్యాధునిక డ్రిల్లింగ్ రిగ్గులను సరఫరా చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్ల మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది. ఓఎన్‌జీసీ రాజమండ్రి చమురు క్షేత్రానికి 2,000 హెచ్ పీ సామర్థ్యం గల అత్యాధునిక ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్ ను అదించడం ద్వారా అయిల్ రిగ్గుల సరఫరాలో ముందడుగు వేసినట్లు సంస్థ తెలిపింది. రాజమండ్రి చమురు క్షేత్రం ఉభయ గోదావరి జిల్లాల్లోని చమురు, గ్యాస్ నిల్వలను కవర్ చేస్తుందని.., దేశీయంగా తయారుచేసిన ఈ అత్యాధునిక ఆయిల్ రిగ్ ప్రపంచంలోనే బెస్ట్ ఫీచర్స్ ని కలిగి ఉందని వెల్లడించింది. ఈ 2,000 హెచ్ పీ సామర్థ్యం కలిగిన రిగ్, 3,000 హెచ్ పీ సామర్థ్యంతో పనిచేసే సాంప్రదాయ రిగ్గు కన్నా అధిక పనితీరును కనబరుస్తుంది. దేశీయంగానే తయారైన ఈ అత్యాధునిక రిగ్గు 6,000 మీటర్ల (6 కి.మీ)లోతు వరకు డ్రిల్లింగ్ చేయగలదు. ఇది ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నట్లు మేఘా తెలిపింది. ఇప్పటి వరకు 10 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులను ఎంఈఐఎల్ సరఫరా చేసింది. ఇందులో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మిగిలిని ఏడు ఇన్‌స్టలేషన్, కమిషనింగ్ చివర దశలో ఉన్నాయి. ఈ రిగ్గులు మరో నాలుగైదు వారాల్లో ఓఎన్జీసీ చమురు క్షేత్రాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయి.ఇదిలా ఉండగా, మెహసన, అంకలేశ్వర్, అగర్తలా, శిబ్ సాగర్ లలోని ఓఎన్ఏసీ క్షేత్రాలకు ఐదు వర్క్ ఓవర్ రిగ్గులను మొదటి లాట్ కింద ఎంఈఐఎల్ సరఫరా చేసింది. ఈ ఐదు రిగ్గులు పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. రెండవ లాట్ లోని ఐదు రిగ్గుల తయారీ చాలా వేగంగా జరుగుతున్నది. ఈ సందర్భంగా ఎంఈఐఎల్ రిగ్గ ఇంచార్జ్ సత్యనారాయణ మాట్లాడుతూ, "కోవిడ్ మహమ్మరి ముగింపు దశకు వచ్చినందున ముందుగా ఇచ్చిన హామీ మేరకు రిగ్గుల తయారీ, సరఫరాను వేగవంతం చేశాం. ఇంధన రంగంలో డౌన్ స్టీమ్, అప్ స్ట్రీమ్ విభాగాల్లో మా కంపెనీ చాలా కీలక భూమికను పోషిస్తున్నది" అని అన్నారు. ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన రంగంలో చమురు, గ్యాస్ క్షేత్రాలను వేగంగా డ్రిల్లింగ్ చేయడంతో పాటు దేశీయ వినియోగం కోసం చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచగల ఈ అత్యాధునిక రిగ్గుల చాలా కీలకంగా మారాయని మేఘా పేర్కొంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్బర్ భారత్ విధానాల్లో భాగంగా దేశీయ టెక్నాలజీతో అత్యంత సమర్ధవంతమైన చమురు డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేస్తున్న మొట్టమొదటి ప్రైవేట్ రంగా సంస్థ ఎంఈఐఎల్ అని మేఘా సంస్థ వెల్లడించింది. కాంపిటీటివ్ బిడ్డింగ్ లో ఓఎస్ఆసీ నుంచి 47 రిగ్గుల ఆర్డర్ ను ఎంఈఐఎల్ దక్కించుకున్నట్లు పేర్కొంది. ఇందులో 20 వర్క్ ఓవర్ రిగ్గులు కాగా, 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు. కాగా, 20 వర్క్ ఓవర్ రిగ్గులలో 12 రిగ్గులు 50 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతోనూ, నాలుగు 100 మెట్రిక్ టన్నులు, మిగిలిన నాలుగు 150 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలవి. అలాగే, 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులలో రెండు 1500 హెచ్ పీ సామర్థ్యం గల మొబైల్ హైడ్రాలిక్ డ్రిల్లింగ్ రిగ్గులు, మరో 17గ్గులు 1,500 హెచ్ పీ సామర్థ్యంతో ఉన్న ఎసీ వీఎడ్లీ రిగ్గులు. మరో ఆరు 2,000 హెచ్ పీ సామర్థ్యం గల ఏసీ వీఎఫ్ డీ రిగ్గులు. రెండు 2,000 హెచ్ పీ సామర్థ్యంతో ఉన్న హెబీ వీఎఫ్ డీ రిగ్గులు.అస్సాం లోని శిబ్ సాగర్, జోర్ హట్, ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి, గుజరాత్ లోని అహ్మదాబాద్, అంకలేశ్వర్, మెహసాన, కాంబే, త్రిపురలోని అగర్తలా, తమిళనాడులోని కరైకల్ లో ఉన్న ఓఎన్‌జీసీ చమురు క్షేత్రాల కోసం ఎంఈఐఎల్ రిగ్గులను తయారు చేసి అందిస్తున్నట్లు మేఘా సంస్థ తెలిపింది. ఈ రిగ్గులును పూర్తి ఆటోమేషన్ లో తయారు చేయడం వల్ల భద్రత, నిర్వహణ చేయడం సులువు అవుతుందని MEIL సంస్థ పేర్కొంది. దీని ద్వారా రిగ్గును డౌన్ చేసే సమయాన్ని తగ్గించవచ్చు. ఈ తరహా రిగ్గులు ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చరిత్రలోనే మొట్టమొదటివి. భవిష్యత్ లో ఈ రిగ్గులు చమురు బావుల డ్రిల్లింగ్ స్వరూపాన్నే మార్చనున్నాయి. ఇలాంటి అత్యాధునికి రిగ్గులే ఇప్పుడున్న పరిస్థితులకు కావాల్సినవే.కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, ఎంఈఐఎల్ తనకున్న నైపుణ్యం, నిబద్ధత, కఠోర శ్రమతో రిగ్గుల తయారీ, సరఫరాను పూర్తి చేయనుంది. విడిభాగాలు గ్లోబల్ కంపెనీల నుంచి అందడంలో ఆలస్యం అవుతున్నప్పటికీ, ఇప్పుడిప్పుడే లాజిస్టిక్స్ మెరుగుపడుతున్న నేపథ్యంలో రిగ్గులను నిర్దేశించుకున్న సమయంలోనే సరఫరా చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu