Ad Code

ఇన్‌స్టాగ్రామ్ నుంచి రెండు యాప్​ల తొలగింపు!


ఇన్​స్టాగ్రామ్​కు చెందిన హైపర్‌లాప్స్, బూమరాంగ్ అనే రెండు స్వతంత్ర యాప్‌లను గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించింది. 2014లో ప్రారంభమైన ఇన్‌స్టాగ్రామ్ హైపర్‌లాప్స్ యాప్​లో టైమ్-లాప్స్ వీడియోలను షూట్​ చేయగలిగే ఫీచర్లను చేర్చింది. ఈ యాప్​కు యూజర్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇప్పటివరకు 2 కోట్లకు పైగా డౌన్​లోడ్స్​ను సాధించింది. మరోవైపు, 2015లో వచ్చిన బూమరాంగ్ యాప్​లో ముందుకు వెనుకకు లూప్ చేసి చిన్న వీడియోలను షూట్ చేయగలిగే ఫీచర్లను అందించింది. ఈ యాప్​ను కూడా తొలగించాలని ఇన్​స్టాగ్రామ్​ నిర్ణయించింది. ఎందుకంటే, ఇన్​స్టాగ్రామ్​ ఒరిజినల్ యాప్​లోనే అన్ని ఫీచర్లను అందించనుంది. ఈ లేటెస్ట్​ ఫీచర్లతో త్వరలోనే ఇన్​స్టాగ్రామ్​ అప్​డేటెడ్​ వెర్షన్​ను అందుబాటులోకి తేనుంది. ఇన్‌స్టాగ్రామ్ తన ఐజీటీవీ యాప్​ను మూసేస్తున్నట్లు గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడ్డ వారం రోజుల్లోనే మరో రెండు యాప్​లను క్లోజ్​ చేస్తుండటం గమనార్హం. ఈ రెండు యాప్​లను నిశ్శబ్దంగా యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుంచి తొలగించింది. ఎటువంటి ముందస్తు అలర్ట్​ లేకుండా మార్చి 1న బూమరాంగ్, హైపర్‌లాప్స్ యాప్‌లను ఆయా యాప్​ స్టోర్ల నుంచి తొలగించింది. ఐజీటీవీ, ఇన్​స్టాగ్రామ్​, ఇన్​స్టాగ్రామ్​ లేఅవుట్ యాప్​లు ఇప్పటికీ యాప్​ స్టోర్​, ప్లే స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్​ల ద్వారా సరదాగా, వ్యక్తిగతీకరించిన లేఅవుట్లను క్రియేట్​ చేయవచ్చు. మల్టిపుల్​ ఫోటోలను జోడించి "రీమిక్స్" చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల గూగుల్ ప్లేస్టోర్​లోకి ఇన్‌స్టాగ్రామ్ లైట్‌ యాప్​ను కూడా తీసుకొచ్చింది. ఇది ఇన్​స్టాగ్రామ్​ ఒరిజినల్​ యాప్​కు టోన్-డౌన్ వెర్షన్. మార్చి 8 నాటికి ఈ యాప్ పది కోట్లకు పైగా డౌన్‌లోడ్లను సాధించింది. Apptopia డేటా ప్రకారం, తాజాగా రిమూవ్​ చేసిన బూమరాంగ్ యాప్​ రోజుకు 26,000 డౌన్​లోడ్లను సాధించింది. అయితే, ఇన్​స్టాగ్రామ్ మాత్రం ఈ రెండు యాప్​ల తొలగింపుపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీటిని సైలెంట్​గా యాప్​ స్టోర్ల నుంచి తొలగించింది. వీటిలోని ఫీచర్లను ఇన్​స్టాగ్రామ్​ యాప్​లోనే అందించేలా కొత్త వెర్షన్​ను త్వరలోనే తీసుకురానుంది. భారత్​లో చైనా బ్యాన్​ అయిన పాపులర్​ షార్ట్​ వీడియో యాప్​ టిక్​టాక్ ప్లేస్​ను చేజిక్కించుకునేందుకు ఇన్​స్టాగ్రామ్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది​. ఇందులో భాగంగానే వరుసగా టిక్​టాక్​ తరహా ఫీచర్లను పరిచయం చేస్తోంది. అందుకే, 2020లో టిక్​టాక్​ తరహా రీల్స్​ ఫీచర్​ను పరిచయం చేసింది. యూజర్లు రీల్స్​ను మరింత సులభంగా క్రియేట్​ చేసుకునేలా కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెడతామని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu