Ad Code

గూగుల్​ ఫొటోస్​లో సరికొత్త అప్​డేట్ !


గూగుల్​ ఫోటోస్​ను సరికొత్త డిజైన్‌తో అప్​డేట్ చేసింది. వినియోగదారులకు ఫోటోలను బ్రౌజ్​ చేయడం, షేర్​ చేయడం, ఇంపోర్ట్​​ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఈ మేరకు గూగుల్​ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ''గూగుల్ విడుదల చేసిన అప్​డేట్ ఆల్బమ్‌లను సోర్టింగ్ చేయడం, ఎక్కడైనా సేవ్ చేసిన ఫోటోలు వీడియోలను డౌన్​లోడ్​చేసుకోవడం, షేర్ చేసిన కంటెంట్‌ను సులభంగా వెతకడం, స్క్రీన్‌ షాట్‌లను సులభంగా కనుగొనడం వంటి ప్రక్రియను సులభతరం చేస్తుంది. గూగుల్ ఫోటోస్​ యాప్​ను లేటెస్ట్ వెర్షన్​కు అప్​డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్లన్నింటినీ ఆస్వాదించవచ్చు.'' అని బ్లాగ్​ పోస్ట్​లో పేర్కొంది. ఈ కొత్త ఫీచర్లలో మరిన్ని ఆప్షన్లు ఉండే లైబ్రరీ ట్యాబ్​ కూడా ఉంటుంది. ఈ లైబ్రరీ ట్యాబ్​​ వినియోగదారులను తమ ఫోటోలు, ఆల్బమ్‌లను మరింత సులభంగా కనుగొనేలా చేస్తుంది. వినియోగదారుల ప్రాధాన్యతను బట్టి గ్రిడ్ లేదా లిస్ట్​ను సులభంగా చూసుకోవచ్చు. ఇందుకు గాను లైబ్రరీ ట్యాబ్ అప్​డేటెడ్​ లేఅవుట్​లో కనిపిస్తుంది. కొత్త డిజైన్​లో ఫోటో రకాన్ని బట్టి సులభంగా ఫోటోలను కనుగొనవచ్చు. ఆల్బమ్‌లు, షేర్డ్ ఆల్బమ్‌లు, ఫేవరెట్‌లు, ఆన్-డివైస్ ఫోల్డర్‌లు వంటి ఆప్షన్ల ద్వారా ఫోటోలను ఫిల్టర్ చేసి సులభంగా మీకు కావాల్సిన వాటిని కనుగొనవచ్చు. గూగుల్​ ఫోటోలను లాక్​ చేసేందుకు కూడా ఈ కొత్త అప్​డేట్​ అనుమతిస్తుంది. ఇందుకు గాను యుటిలిటీస్, ఆర్కైవ్, ట్రాష్ ఆప్షన్‌తో కూడిన కొత్త 'ఇంపోర్ట్​​ లేటెస్ట్​ ఫోటోస్' సెక్షన్​ను కూడా జోడిస్తోంది. ఇది వినియోగదారులు ఫోటోలను సులభంగా కాపీ చేయడానికి, ఫోటోలను లేదా వీడియోలను డిజిటలైజ్ చేయడానికి లేదా కెమెరా నుండి ఫోటోలను ఫోన్​లోకి ట్రాన్స్​ఫర్​ చేయడానికి అనుమతిస్తుంది. ఆల్బమ్స్​ షేరింగ్​ కోసం కూడా కొత్త సెక్షన్లను జోడించింది. ఈ సెక్షన్ల​ ద్వారా మీరు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను కనుగొనడం, వీక్షించడం, నిర్వహించడం చాలా సులభంగా మారుతుంది. ఈ సరికొత్త అప్​డేట్లు ఈ వారం ఆండ్రాయిడ్​ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఐఓఎస్​ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వస్తాయి. మీరు ఫోటోలను బ్యాకప్ చేయనప్పటికీ.. మీ ఇటీవలి స్క్రీన్‌షాట్‌లను సులభంగా కనుగొనేలా కొత్త అప్‌డేట్​ను రూపొందించింది. కాగా, గూగుల్ ఫోటోస్​ ఇటీవల తన ఐఓఎస్​ యూజర్ల కోసం పోర్ట్రెయిట్ లైట్, బ్లర్, స్మార్ట్ సూచనతో సహా అనేక ఎడిటింగ్ టూల్స్​ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu