Header Ads Widget

సరికొత్త ఐస్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు


శాస్త్రవేత్తలు భూమి ఉపరితలంపై ఎక్కడా ఉనికిలోలేని మంచు కొత్త రూపాన్ని కనుగొన్నారు. ఆ దశ ఇంతవరకూ భూమిపై కనిపించలేదని, ఇది భూమికి సుదూర ప్రాంతాల్లోని గ్రహాల ఒక లక్షణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బృహస్పతి (జూపిటర్‌) గ్రహం చంద్రుడి ఉపరితలం కింద మంచురూపంలో నీరున్నట్లు నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని కనిపెట్టేందుకు 2024లో యూరోపా క్లిప్పర్ మిషన్‌ను పంపేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే, ఈ ప్రయోగానికి ముందే నెవాడా లాస్ వెగాస్ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్, ఖగోళ శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకుల నేతృత్వంలో బృందం మంచు కొత్తరూపాన్ని కనుగొన్నది. అధిక పీడనం కింద నీటి లక్షణాలను అధ్యయనం చేస్తున్న ఈ బృందం శాస్త్రవేత్తలు క్యూబిక్ ఫేజ్ ఐస్-వీఐఐ, ఐస్-ఎక్స్‌కు మధ్యస్థంగా టెట్రాగోనల్ ఫేజ్‌లోఉన్న ఐస్-వీఐఐటీ అనే కొత్త దశను కనుగొన్నారు. అయితే, ఇలాంటి ఐస్ భూ ఉపరితలంలో ఎక్కడా ఉనికిలో ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. ఇది భూమి మాంటిల్‌లో లేదా సౌర వ్యవస్థ వెలుపల ఉన్న చంద్రులు లేదా నీరు అధికంగా ఉండే గ్రహాల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అధ్యయనం ఫిజికల్ రిబ్యూ బీలో ప్రచురితమైంది.


Post a Comment

0 Comments