షావోమీ 12 ప్రో' ఏప్రిల్ 27 విడుదల


షావోమీ 12 ప్రో ఏప్రిల్ 27న భారత మార్కెట్లో విడుదలకానుంది. దీని ధర రూ.66,999 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్పటికే అమెరికా , చైనా, ఐరోపా దేశాల్లో విడుదలైంది. చైనా లో దీని ధర రూ.56,300  , అమెరికాలో రూ.76,300 ఉంది. అమెజాన్ వెబ్ సైట్ లోనూ ‘ షావోమీ 12 ప్రో’ విక్రయాలు జరగనున్నాయి. దీనికి ప్రధాన పోటీ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ‘ వన్ ప్లస్ 10 ప్రో’ నుంచి ఎదురుకానుంది. దాని ధర రూ.70,000. ‘ వన్ ప్లస్ 10 ప్రో’ తో పోలిస్తే తక్కువ ధర ఉండటం ‘ షావోమీ 12 ప్రో’ కు కలిసొచ్చే అవకాశం ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ తో ఈ ఫోన్ వస్తుంది. 6.73 అంగుళాల స్క్రీన్ తో పాటు WQHD+ రేజెల్యూషన్ ఉంటుంది. 1500 నిట్స్ బ్రైట్ నెస్ తో కూడిన E5 ఆమోల్డ్ ప్యానెల్ ఉంటుంది. 120 HZ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది. 240 HZ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. ఫోన్ ప్యానెల్ పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అమర్చి ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా ఉంటుంది. వీటిలో ఒకటి సోనీ IMX707 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా. ఫోన్ ముందు భాగంలో 32 మెగా పిక్సెల్స్ తో ఉండే ఒక సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ లో 4,600 MAH తో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 120 వాట్స్ ఛార్జర్ ను కూడా ఫోన్ తో పాటు ఇస్తారు. ఈ ఫోన్ ను 50 వాట్స్ వైర్ లెస్ ఛార్జింగ్ చేసుకునేందుకు అనుగుణంగా రూపొందించారు. 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. స్పీకర్ సిస్టం ను ‘ హర్మన్ కార్డన్ ‘ కంపెనీ అభివృద్ధి చేసింది.

Post a Comment

0 Comments