Ad Code

32 మందితో గ్రూప్ వాయిస్ కాలింగ్ !


వాట్సాప్ కమ్యూనిటీ ట్యాబ్, ఎమోజీ రియాక్షన్లు, బిగ్ సైజ్ ఫైల్ షేరింగ్ వంటి చాలా ఫీచర్ల ను తీసుకువస్తున్నట్లు వారం రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. సింగిల్ ఆడియో కాల్‌లో  ఒకేసారి 32 మంది మాట్లాడుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు వాట్సాప్ అనౌన్స్ చేసింది. అయితే ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే లేటెస్ట్ ఐఓఎస్ స్టాండర్డ్ వెర్షన్‌ లో రిలీజైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది కొన్ని దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఇండియన్ యూజర్లకు కూడా న్యూ ఫీచర్ల తో కూడిన కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ విడుదల చేస్తోంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో గరిష్ఠంగా 32 మంది యూజర్లు గ్రూప్ వాయిస్ కాల్‌లో పాల్గొనవచ్చు. ఇంతకుముందు వాట్సాప్ గ్రూప్ ఆడియో కాల్‌లో 8 మంది మాత్రమే ఒకేసారి మాట్లాడుకోగలిగారు. అయితే ఇప్పుడు యూజర్ల పరిమితిని వాట్సాప్ పెంచింది. ఈ ఫీచర్ చాలామందికి ఉపయుక్తంగా ఉండనుంది. అయితే లేటెస్ట్ అప్‌డేట్‌ సోషల్ ఆడియో లేఅవుట్ , స్పీకర్ హైలైట్, వేవ్‌ఫామ్‌ల ఇంటర్‌ఫేస్‌ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. వాయిస్ కాల్స్‌లో యూజర్ల సంఖ్య పెరిగినప్పుడు న్యూ లుక్ కనిపించాలని ఇది ఆడియో లేఅవుట్ ఇంప్రూవ్ చేసింది. ఈ విజువల్ ఫీచర్లన్నీ చక్కగా కనిపించే ఇంటర్‌ఫేస్‌ను అందిస్తాయి. ఇదే అప్‌డేట్‌లో వాయిస్ మెసేజ్ బబుల్‌ల కోసం అప్‌డేటెడ్ డిజైన్‌లు, కాంటాక్ట్ & గ్రూప్‌ల కోసం ఇన్ఫో స్క్రీన్‌లు ఉన్నాయి. ఇంకా ఈ అప్‌డేట్‌లో గ్యాలరీలో ఫేవరెట్ మీడియాను యాక్సెస్ చేసే సదుపాయం ఉంది. కరోనా సమయంలో వాట్సాప్ గ్రూప్ వాయిస్ కాల్‌  ఫీచర్ తీసుకొచ్చింది. ఇది మొదట్లో నలుగురు యూజర్లు ఒకేసారి గ్రూప్ కాల్‌లో చేరడానికి అనుమతించింది, ఆ తర్వాత ఎనిమిది వరకు పొడిగించింది. ఈ పరిమితి ఇప్పుడు 32ki మారుతోంది. వాట్సాప్ వాయిస్ కాల్‌లు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇవి ఫ్రీగా హెచ్‌డీ ఆడియో క్వాలిటీని ఆఫర్ చేస్తాయి. అయితే వీటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ తప్పనిసరి. వాయిస్ కాల్‌ని ప్రారంభించడానికి, యూజర్లు ఏదైనా కాంటాక్ట్‌ ఓపెన్ చేసి కాల్ ఐకాన్‌పై నొక్కాలి. గ్రూప్ వాయిస్ కాల్‌ని స్టార్ట్ చేసేందుకు ఓపెన్ గ్రూప్ చాట్> కాల్ ట్యాబ్‌ > ప్లస్ ఐకాన్ > స్టార్ట్ గ్రూప్ కాల్‌ ఆప్షన్లపై క్లిక్ చేయాలి. వాట్సాప్ ఇటీవల 2జీబీ వరకు సైజు ఉన్న ఫైల్‌లను షేర్ చేయడం వంటి మరిన్ని ఫీచర్లను జోడించనున్నట్లు ప్రకటించింది. అలానే గ్రూప్ చాట్ అడ్మినిస్ట్రేటర్‌ని ఎప్పుడైనా ఇబ్బందికర మెసేజెస్ తొలగించడానికి కూడా వాట్సాప్ అనుమతించనున్నట్లు తెలిపింది. రిమూవ్ లేదా డిలీట్ చేసిన ఈ మెసేజెస్ గ్రూప్ సభ్యులెవరికీ కనిపించవని కంపెనీ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్ కమ్యూనిటీలను సృష్టించే ఆప్షన్ కూడా అందిస్తుంది. కమ్యూనిటీస్ ఫీచర్‌తో స్కూళ్లు, రెసిడెన్షియల్ సొసైటీలు, స్నేహితుల గ్రూప్స్ అన్ని కలిసి ఒకేసారి సులభంగా కమ్యూనికేట్ అవ్వచ్చు. అలాగే ఏ విషయంపైనైనా అనేక గ్రూపులతో డిస్కస్ చేయొచ్చు

Post a Comment

0 Comments

Close Menu