Header Ads Widget

ఒప్పో ఏ55ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ రూ.13 వేలు !

 


చైనాలో ఒప్పో ఏ55ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. కంపెనీ లాంచ్ చేసిన చౌకైన 5జీ ఫోన్ ఇదే. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు. 6.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,099 యువాన్లుగా (సుమారు రూ.13,100) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లుగా (సుమారు రూ.14,300) ఉంది. బ్రిస్క్ బ్లూ, రిథమ్ బ్లాక్, టెంపెరామెంట్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

Post a Comment

0 Comments