Ad Code

గేమింగ్ ప్రియులకు ఐకూ నియో 6 !


చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ లేటెస్ట్‌గా ఐకూ నియో 6 మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో 120Hz అమొలెడ్ డిస్‌ప్లే డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్  లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలో రిలీజైంది. త్వరలో ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే ఈ మొబైల్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.33,500 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.35,900. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ.39,400. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, బ్లూ, ఆరెంజ్ కలర్స్‌లో కొనొచ్చు.  ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల ఇండియాలో రిలీజైన రియల్‌మీ జీటీ 2 ప్రో, వన్‌ప్లస్ 10ప్రో, ఐకూ 9 ప్రో, మోటో ఎడ్జ్ 30 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉంది. ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 64మెగాపిక్సెల్ Samsung ISOCELL Plus GW1P ప్రైమరీ కెమెరా + 12మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఆరిజిన్ ఓఎస్ ఓషియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 4,700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. సున్నా నుంచి 30 శాతానికి 5 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 35 నిమిషాలు చాలు. ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు 44వాట్ ఫ్లాష్‌ఛార్జ్ పవర్ బ్యాంక్, ఐకూ ఎక్స్‌స్ట్రీమ్ విండ్ కూలింగ్ క్లిప్‌ను కూడా రిలీజ్ చేసింది కంపెనీ. ఈ పవర్ బ్యాంకుతో ఐకూ నియో 6 స్మార్ట్‌ఫోన్‌ను 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయొచ్చు. ఈ పవర్ బ్యాంకు ధర సుమారు రూ.3,600. ఇండియాలో ఇటీవల ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్ లాంఛైన సంగతి తెలిసిందే. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇదే సిరీస్‌లో ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంఛ్ చేయనుంది ఐకూ. ఇందులో స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)

Post a Comment

0 Comments

Close Menu