Ad Code

వాట్సాప్ లో కొత్తగా 8 ఏమోజీలు ?


యూజర్లకు లేటెస్టు అప్ డేట్స్ ను పరిచయడం చేయడంలో వాట్సాప్ ముందుంటుంది. ఇప్పటికే ఎన్నో అప్ డేట్స్ చేసిన వాట్సాప్ఇ ప్పుడు సరికొత్తగా మరిన్ని రియాక్షన్స్ ఎమోజీలను ఇవ్వనుంది. గతంలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఎమోజీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో వాట్సాప్ కూడా ఎమోజీలను యూజర్లకు పరిచయం చేయునున్నట్లు సమాచారం. వాట్సాప్ లో స్టేస్ అప్ డేట్ ను చూసేటప్పుడు ఎమోజీని పంపించేందుకు క్విక్ రియాక్షన్ ఫీచర్ పై ఈ మెసేజింగ్ సర్వీసు పనిచేస్తోంది. ఈ ఫంక్షనాలిటీ ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్, మెసేంజర్ తోపాటు ఇతర మెటా యాజమాన్య ఫ్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది. రియాక్షన్స్ ఆప్షన్స్ మొత్తం 8 ఎమోటికాన్ లను యూజర్లకు పరిచయం చేయనుంది. అయితే ఈ క్విక్ రియాక్షన్స్ ఫీచర్ డెవలప్ మెంట్ గురించి వాట్సాప్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫాం క్విక్ రియాక్షన్ ఫీచర్ పై పనిచేస్తోంది. ఇది పర్సనల్ ఎమోజీని మెసేజ్ లా పంపించకుండా స్టేటస్ అప్ డేట్ ద్వారా భావాలను వ్యక్తికపర్చేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లకు ఆకర్షణీయంగా నిలుస్తోంది. వాట్సాప్ లో 8 ఎమోజీలను రియాక్షన్ గా ఉపయోగించడం కోసం కళ్లతో నవ్వుతున్న ముఖం, ఆనందం కన్నీళ్లతో కూడిన ముఖం, నోరు తెరచిన ముఖం, ఏడుపు ముఖం, చేతులు ముడుచుకున్న వ్యక్తి చప్పట్లు కొట్టడం, పార్టీ పాప్పర్, వంద పాయింట్ల ఎమోజీలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఫీచర్ ఇంకా డెవలప్ లోనే ఉందని…భవిష్యత్తులో కొత్త అప్ డేట్స్ తో అందుబాటులోకి వస్తుందని రిపోర్టు పేర్కొంది. కమ్యూనిటీ ట్యాబ్, ఎమోజీ రియాక్షన్లు, బిగ్ సైజ్ ఫైల్ షేరింగ్ వంటి చాలా ఫీచర్లను తీసుకువస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే వాట్సాప్ ప్రకటించింది. అలాగే సింగిల్ ఆడియో కాల్లో ఒకసారి 32మంది మాట్లాడుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది. అయితే ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే లేటెస్ట్ ఐఓఎస్ స్టాండర్ట్ వెర్షన్ విడుదలైనట్లు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu