Ad Code

BHIM UPIతో UAE లో షాపింగ్ !


NPCI అంతర్జాతీయ ఆర్మ్ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) ఇప్పుడు BHIM UPI ని ప్రారంభించింది. ఈ BHIM UPI ఇప్పుడు UAE అంతటా ఉన్న NEOPAY టెర్మినల్స్‌లో అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో UAEకి తరచూ ప్రయాణించే భారతీయ పౌరులందరూ BHIM UPIని ఉపయోగించి తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. "UAEకి ప్రయాణించే మిలియన్ల మంది భారతీయులకు BHIM UPIని ఉపయోగించి సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు" అని సంస్థ తెలిపింది. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) మష్రెక్ బ్యాంక్ యొక్క పేమెంట్ అనుబంధ సంస్థ NEOPAYతో భాగస్వామ్యం కలిగి ఉండడంతోనే భారతీయ పౌరులు BHIM UPIని ఉపయోగించి ఆ దేశంలో UPI పద్దతిలో చెల్లింపులు చేయగలుగుతున్నారు. BHIM UPI ఆధారంగా ఇప్పుడు UAE అంతటా పేమెంట్స్ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. కాకపోతే ఈ సర్వీస్ కేవలం NEOPAY టెర్మినల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.  "NEOPAYతో కొత్తగా భాగస్వామ్యం కుదరడంతో UAEలో BHIM UPI అందుబాటులోకి రావడాన్ని మేము సంతోషిస్తున్నాము. దీనితో భారతీయ పౌరులకు ఇష్టమైన పేమెంట్ విధానంగా ఉద్భవించిన BHIM UPIని ఉపయోగించి భారతీయ పర్యాటకులు అన్ని రకాల పేమెంట్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది"అని NIPL CEO రితేష్ శుక్లా ఈ సందర్భంగా అన్నారు. UAE లో BHIM UPI ఫీచర్ ని ఉపయోగించడం అనేది చాలా సులభం. ఇందుకోసం వినియోగదారులకు భారతదేశంలో రిజిస్టర్ చేయబడిన బ్యాంక్ అకౌంట్, UPI కనెక్టివిటీ మరియు దేశంలో పేమెంట్స్ చేయడానికి వినియోగదారులు ఉపయోగించగల UPI ఆధారిత యాప్ అవసరం అవుతుంది. కొత్త భాగస్వామ్యంతో NEOPAY టెర్మినల్స్ పేమెంట్స్ మొత్తాన్ని రూపాయిలలో మారుస్తూ వినియోగదారుల నుండి వసూలు చేస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu