Ad Code

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాస్‌వర్డ్‌లు


పాస్వర్డ్ ఎంత పటిష్టంగా ఉంటుందో  డేటా లేదా బ్యాంక్ వివరాలు లేదా ఇంకేదైనా ముఖ్యమైన వివరాలు అంత సేఫ్ గా ఉంతుందో తెలిసిందే.  అయితే, చాలా మంది పేలవమైన పాస్వర్డ్ లను ఉపయోగిస్తుంటారు మనలో చాలామంది వారి ఫోన్, ఇమెయిల్, సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో సహా మరిన్ని వాటికి ఒకేవిధమైన పాస్వర్డ్లను ఉపయోగిస్తున్నారు.  ఒక సెక్యూరిటీ సంస్థ అత్యంత ప్రమాదకరమైన పాస్వర్డ్ జాబితాను వెల్లడించింది.  ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ యొక్క నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ గత 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పాస్వర్డ్ల జాబితాను విడుదల చేసింది. అంతేకాదు, వీటిని ఎందుకు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా వెల్లడించింది. అసలు కారణం ఏమిటంటే, కేవలం గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండడానికి ఈ పాస్వర్డ్లను ఉపయోగిస్తున్నట్లు ఈ సంస్థ గుర్తించింది. వాస్తవానికి, గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుందని చాలా సులభంగా ఉండే పాస్వర్డ్లను ఉపయోగించడం ప్రమాదకరం అని కూడా ఈ సంస్థ పేర్కొంది.  ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించిన అత్యంత ప్రమాదకరమైన 10 పాస్వర్డ్ లు : 123456, 123456789, qwerty, password, 12345, qwerty123, 1q2w3e, 12345678, 11111, 1234567890

Post a Comment

0 Comments

Close Menu