టాప్ సేఫ్టీ యాప్స్ ... !


మహిళలకు భద్రత కల్పించాలనుకునే వారు ఈ యాప్స్‌ను సిఫారసు చేయవచ్చు. వాటి గురించి తెలుసుకొని మీకు తెలిసిన మహిళలకు ఈ యాప్‌లను సిఫార్స్ చేయండి. 112 యాప్ (112 APP) యాప్ ను కేంద్ర హోం శాఖ రూపొందించింది. 112 యాప్ తో అత్యవసర పరిస్థితుల్లో రక్షణ పొందొచ్చు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను గుర్తించి ఈ యాప్ వాలంటీర్లకు సమాచారాన్ని అందిస్తుంది. వారు తక్షణమే మీకు సాయం అందజేస్తారు. మీరు కూడా ఈ యాప్ వాలంటీర్ గా నమోదు చేసుకుని అసరమైనవారికి హెల్ప్ చేయొచ్చు. రక్ష యాప్ మొబైల్ లో ఇన్ స్టాల్ అయ్యి ఉంటే కాస్త సేఫ్ గా ఫీలవ్వొచ్చు. ఎందుకంటే.. ఒక్క బటన్ నొక్కగానే.. యాప్ లో ముందుగానే సెలక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్ కు మన వివరాలన్నీ చేరిపోతాయి. ఇంటర్నెట్ లేకపోయినా.. వాల్యూమ్ బటన్ మూడు సార్లు ప్రెస్ చేయగానే మీ సెలక్టెడ్ కాంటాక్ట్స్ కు లొకేషన్ తో సహా మీ వివరాలన్నీ తెలిసిపోతాయి. తెలంగాణ పోలీసులు రూపొందించిన హాక్ ఐ యాప్ కూడా అత్యవసర సమయాల్లో మహిళలకు రక్షణగా నిలుస్తోంది. ప్రమాద సమయాల్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే.. మీ వివరాలు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు, ఏసీపీకి, డీసీపీకి, పెట్రోలింగ్ వ్యాన్‌కు చేరిపోతాయి. వెంటనే వారు రంగంలోకి దిగి మీకు రక్షణ కల్పిస్తారు. ఆండ్రాయిడ్ ట్రోజన్ యాప్, ఆండ్రాయిడ్ మాల్‌వేర్ యాప్, ఆండ్రాయిడ్ యాప్, గూగుల్ ప్లేస్టోర్, డేంజరస్ యాప్"  మీరు మొబైల్ బయటకు తీయలేని పరిస్థితుల్లో వాయిస్ కమాండ్ ద్వారా కూడా ఈ యాప్ కు కమాండ్స్ ఇవ్వొచ్చు. ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టు నటించేందుకు దీనిలో ఫేక్ కాల్ ఫీచర్ కూడా ఉంది. మీ సన్నిహితులకు క్షణాల్లో లొకేషన్, ఆడియో,-వీడియో వివరాలను అందజేస్తుంది.  సేఫ్టి పిన్ యాప్ మీరు సేఫ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. రిస్కీ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు ఈ యాప్ నోటిఫికేషన్ పంపిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, సెక్యూరిటీ, లైటింగ్, బహిరంగ ప్రదేశాలు లాంటి వివరాలు అందజేస్తుంది.  అకస్మాత్తుగా మీపై దాడి జరిగితే వెంటనే చిల్లా యాప్ గుర్తిస్తుంది. మీ గొంతును గుర్తించి యాప్ స్పందిస్తుంది. మీ సన్నిహితులకు అలెర్ట్ మెసేజ్ అందిస్తుంది. అలాగే పవర్ బటన్‌ను ఐదుసార్లు నొక్కితే మీ లొకేషన్ మీ సన్నిహితులకు తెలిసిపోతుంది. స్మార్ట్ 24*7 యాప్ అత్యవసర సందర్భాల్లో ఆడియో, వీడియో, ఫోటోలు రికార్డ్ చేసి పంపుతుంది. ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే.. మీరు ఎంచుకున్న కాంటాక్ట్స్ కు మీ వివరాలు పంపిస్తుంది.  ఏపీ పోలీస్ సేవా యాప్ సాయంతో అత్యవసర పరిస్థితుల్లో మీరు ఏపీ పోలీసులను కాంటాక్ట్ చేయవచ్చు. మీ నుంచి సిగ్నల్ అందిన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ నుంచి మీకు తక్షణ సాయం అందుతుంది. 

Post a Comment

0 Comments