Ad Code

మరణించాక సోషల్ మీడియా ఖాతా ఏమవుతుంది ?


డిజిటల్ ప్రపంచంలో మీ ఇమెయిల్ అకౌంట్లు, క్లౌడ్ స్టోరేజీ, సోషల్ అకౌంట్స్ ఇలా అనేక ప్లాట్‌ఫామ్స్‌లో పర్సనల్ డేటా ఉంటుంది. అందులో వ్యక్తిగత వివరాలు, ఆర్థిక వివరాలు, ప్రైవేట్ వ్యవహారాలు... ఇలా సమస్త సమాచారం ఉంటుంది. ప్లాట్ ఫాం ను బట్టి ఈ ఫీచర్ మారుతుంది. కొన్నింట్లో మరణిస్తే.. ఎవరు వినియోగించాలో ముందుగా నిర్ణయించ వచ్చు.. ఫేస్ బుక్ లో లెగసీ కాంటాక్స్ అనే ఆప్షన్ ఇస్తారు. ఎవరైనా చనిపోయాక వారి డేటా మొత్తం ఏం కావాలి? ఎవరి చేతుల్లోకి వెళ్లాలి? అసలు ఆ డేటా ఉండాలా వద్దా? ఆ డేటాను యాక్సెస్ చేయడానికి ఎవరికైనా అనుమతి ఇవ్వాలా? ఇలాంటివన్నీ మీరు ముందే నిర్ణయించుకోవచ్చు. మీ ఆస్తులకు వారసుల్ని, మీ ఇన్స్యూరెన్స్ డబ్బులకు నామినీలను ఎంపిక చేసినట్టే డిజిటల్ ప్రపంచంలోని మీ డేటాను ఎవరి చేతికి ఇవ్వాలో కూడా మీరు ముందే నిర్ణయించొచ్చు. సంస్థను బట్టి నిబంధనలు మారుతాయి. ఫేస్‌బుక్‌లో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే ఫీచర్లు లేవు. అయితే మీరు చనిపోయారని ఫేస్‌బుక్‌కు సమాచారం అందిన తర్వాత వెరిఫై చేసి మీ అకౌంట్ డిలిట్ చేస్తుంది. లేదా మీ పేజీని 'మెమొరలైజ్డ్' అకౌంట్‌గా మార్చేందుకు అవకాశం ఇస్తుంది. అంటే మీ అకౌంట్ ఉంటుంది కానీ... అది ఎవరికీ దక్కదు. గుర్తుంచుకోదగిన Facebook పేజీ ఇతర పేజీల వలె కనిపిస్తుంది కానీ వ్యక్తి పేరు పక్కన "రిమెంబరింగ్" అనే పదాన్ని కలిగి ఉంటుంది. ఇక చనిపోయిన వ్యక్తి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాలంటూ ట్విట్టర్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే డీయాక్టివేషన్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం లేదు. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫేస్‌బుక్‌కు చెందిన కంపెనీ కావడంతో నియమనిబంధనలన్నీ ఒకేలా ఉన్నాయి. మీ అకౌంట్ మెమొరలైజ్డ్‌గా మార్చొచ్చు. లేదా మీ అకౌంట్ డిలిట్ చేయాలంటూ మీ కుటుంబ సభ్యులు కోరొచ్చు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీ అకౌంట్ డిలిట్ అవుతుంది. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని లింక్డ్‌ఇన్‌ అకౌంట్ డిలిట్ చేయాలంటే కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయాలి. ప్రూఫ్ ఆఫ్ డెత్ సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ తర్వాత అకౌంట్ తొలగిస్తుంది లింక్డ్‌ఇన్. యాపిల్  "లెగసీ డీల్" ఫీచర్ వ్యక్తి చనిపోయిన తర్వాత Apple IDని యాక్సెస్ చేయడానికి విశ్వసనీయ పరిచయాన్ని అనుమతిస్తుంది. గూగుల్ లో  ఏ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలో కూడా కస్టమైజ్ చేయొచ్చు. మీరు చెప్పినవారికి డేటా వెళ్లిన తర్వాత మూడు నెలల్లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అకౌంట్ డిలిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఫీచర్ యాక్టివేట్ చేయకపోతే ఎలా అన్న అనుమానం రావొచ్చు. మీరు చనిపోయిన తర్వాత మీ డేటాను కోరుతూ మీ కుటుంబ సభ్యులు గూగుల్‌కు దరఖాస్తు చేయొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu