Ad Code

ఫేస్‌బుక్ అకౌంట్ పేరు మార్చలా?


ఫేస్‌బుక్ ని ఉపయోగిస్తున్న వినియోగదారులు ఇప్పుడు వారి ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్‌లో పేరును మార్చవచ్చు. కొన్ని సందర్భాల్లో పేరు మార్పు జరగవచ్చు. అలా అయితే ఈ ఎంపిక వినియోగదారులకు సహాయపడుతుంది. ఒకసారి పేరు మార్చుకుంటే కనుక దాదాపు 60 రోజుల వరకు మళ్లీ మార్చడం వీలుండదు. వినియోగదారులు మొబైల్ మరియు వెబ్ వెర్షన్ లలో వారి పేరును మార్చవచ్చు. ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, అకౌంటుకు లాగిన్ చేసి కుడివైపున దిగువ భాగంలో ఉన్న హాంబర్గర్ మెనుని నొక్కండి. క్రిందికి స్క్రోల్ చేసి 'సెట్టింగ్‌లు మరియు ప్రైవసీ'పై నొక్కండి. డ్రాప్ డౌన్ మెను కనిపిస్తుంది మరియు మీరు సెట్టింగ్‌లపై క్లిక్ చేయాలి. ఇప్పుడు 'వ్యక్తిగత మరియు అకౌంట్ సమాచారం' ఎంపికకు వెళ్లి పేరును ఎంచుకోండి. తరువాత మీ కొత్త పేరును నమోదు చేసి రివ్యూ మార్పును నొక్కండి. ఇది మిమ్మల్ని పాస్‌వర్డ్‌ను నమోదు చేయమని అడుగుతుంది. నమోదు చేసి మార్పులను సేవ్ చేయి ఎంపిక మీద నొక్కండి. కొంత సమయం తర్వాత మీ కొత్త పేరు మీ  ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ప్రత్యక్షం అవుతుంది.

బ్రౌజర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్ పేరును మార్చే విధానం : https://www.facebook.com/కి వెళ్లి అకౌంట్ కి లాగిన్ అవ్వండి. కుడివైపు ఎగువ మూలలో గల నోటిఫికేషన్‌ల చిహ్నం పక్కన ఉన్న డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేయండి. 'సెట్టింగ్‌లు మరియు ప్రైవసీ' > 'సెట్టింగ్‌లు' ఎంపికల మీద క్లిక్ చేయండి. ఇది మీ అకౌంట్ సమాచారాన్ని చూపుతుంది. 'పేరు' పక్కన ఉన్న సవరణ ఎంపికపై క్లిక్ చేయండి. మీ కొత్త పేరును నమోదు చేసి 'రివ్యూ మార్పు' ఎంపిక మీద నొక్కండి. ఇది పాస్‌వర్డ్‌ను నమోదు చేయమని మిమ్మల్ని అడుగుతుంది. నమోదు చేసి, మార్పులను సేవ్ చేయి నొక్కండి.

ఫేస్‌బుక్  ప్రొఫైల్‌ను ఎలా లాక్ చేసే విధానం: ఫేస్‌బుక్ ప్రొఫైల్ పేజీని సందర్శించండి. తరువాత ప్రొఫైల్ పేరులో 'మోర్' ఎంపిక మీద నొక్కండి. డ్రాప్ డౌన్ మెను నుండి 'లాక్ ప్రొఫైల్' ఎంపిక కోసం చూడండి మరియు దానిపై క్లిక్ చేయండి. మీ స్క్రీన్‌పై నొక్కిన తర్వాత మీరు నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు. మీ ప్రొఫైల్‌ను లాక్ చేయడానికి 'మీ ప్రొఫైల్‌ను లాక్ చేయి'ని క్లిక్ చేయండి.

Post a Comment

0 Comments

Close Menu