Ad Code

అత్యవసర సేవలన్నింటికి ఒక్కటే నంబర్‌ ?


దేశంలో అత్యవసర సేవలన్నింటికి ఒక్కటే నంబర్‌.. హోం శాఖ నిర్ణయించింది.  ఇకపై ఆయా రాష్ట్రాలు ఈ నంబర్‌ను ప్రచారం చేయాలని భావిస్తున్నాయి. అంతే కాకుండా డయల్‌ 100కు కాల్‌ చేసిన వారికి వచ్చే సందేశంలో 100కు బదులుగా డయల్‌ 112 అంటూ మార్చాలని చూస్తున్నారు. సాధారణంగా అత్యవసర సాయం కోసం బాధితులు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసేటప్పుడు.. అన్ని సందర్భాల్లో పూర్తి వివరాలు అందించే పరిస్థితి ఉండదు. సమాచారం అందగానే ఎంత తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తే బాధితులకు అంత ఊరట ఉంటుంది. కాబట్టి కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన కాల్, మెసేజ్, మెయిల్‌ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించేందుకు రాష్ట్ర పోలీసుల దగ్గర ఇప్పటికే కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది. తాజాగా ఎన్‌ఈఆర్‌ఎస్‌ అమలుతో మరింత అత్యాధునిక పరిజ్ఞానం చేకూరుతుంది. ఇది పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తే జీఐఎస్‌ పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్‌ కంట్రోల్‌ రూమ్స్‌లో ఉంటా యి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యా దు చేస్తున్నారో తక్షణం గుర్తించవచ్చు. 112'వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలు నిర్విరామంగా పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ తరహా కాల్‌ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. పోలీసు, మెడికల్, ఫైర్, విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు సహా ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు మొత్తం 9 రకాల అత్యవసర సేవలకు ఈ కాల్‌ సెంటర్‌ను ఆశ్రయించేలా ఏర్పాటు చేస్తోంది. ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్‌ ద్వారా కాల్, ఎస్సెమ్మెస్, ఈ మెయిల్, చాట్, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌లో ఏర్పాటు చేసే ప్యానిక్‌ బటన్, వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్, మొబైల్‌ యాప్స్, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ).. ఇలా అన్ని మాధ్యమాల ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ప్రకృతి వైపరీత్యాలు సంభ వించినప్పుడు సత్వర స్పందన కోసం పోలీసు విభా గంతో పాటు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, మున్సి పల్‌ కార్పొరేషన్లకు ఒకేసారి సమాచారం అందేలా ఇంటిగ్రేటెడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్‌ నేరాల్లో బాధితులకు సహాయం చేయడానికి కేంద్రం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని కూడా 112లో కలిపేయాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి

Post a Comment

0 Comments

Close Menu