జొమాటో, స్విగ్గీ దేశవ్యాప్తంగా డౌన్ అయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల దేశవ్యాప్తంగా యూజర్లకు అంతరాయం కలుగుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్రాష్ కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని భావిస్తున్నారు. చాలా వరకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌పై ఆధారపడుతుంటాయి. జొమాటో, స్విగ్గీ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవల్ని పొందుతుండటంతో ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ ఒకేసారి డౌన్ అయ్యాయి. తాము సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమ టీమ్ పనిచేస్తోందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని జొమాటో ట్వీట్ చేసింది. మరోవైపు స్విగ్గీ కూడా తాము సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నారని స్విగ్గీ తెలిపింది. జొమాటో, స్విగ్గీ ఒకేసారి డౌన్ కావడంతో ట్విట్టర్ సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వరుసగా పోస్టులు చేస్తున్నారు యూజర్లు. తాము మెనూ చూడలేకపోతున్నామని, బ్రౌజ్ చేయలేకపోతున్నామని, ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి రావట్లేదంటూ కంప్లైంట్స్ చేశారు. జొమాటో, స్విగ్గీ సంస్థలకు చెందిన కస్టమర్ సపోర్ట్ ట్విట్టర్ హ్యాండిల్స్ వారికి రెస్పాన్స్ ఇస్తున్నాయి.
0 Comments