Header Ads Widget

అమెజాన్ లో ఫోన్లపై బంపర్ ఆఫర్లు !

 

మీ బడ్జెట్‌ రూ.30,000 అయితే అమెజాన్‌లో వివిధ కంపెనీలకు చెందిన ఫోన్లు చాలా అందుబాటులో ఉన్నాయి. Vivo V21 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్‌లో రూ.27,990కి అందుబాటులో ఉంది. ఇంతకు ముందు రూ.32,990గా ఉన్న ఫోన్‌ ధర ఇప్పుడు తగ్గింది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ.2000 తక్షణ తగ్గింపును పొందే అవకాశం ఉంది. కనీసం రూ.5000 కొనుగోలుపై సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు (నాన్-ఇఎంఐ)పై రూ.1000 వరకు 10 శాతం తక్షణ తగ్గింపును అందుకొనే సదుపాయం ఉంది. అమెజాన్‌ వెబ్‌సైట్లో OPPO F19 Pro + 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.25,990గా ఉంది. ఈ ఫోన్‌ సాధారణ ధర రూ.29,999. ప్రస్తుతం 13 శాతం తగ్గింపు ధరతో స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫోన్‌ కొనుగోలుపై రూ.4000 ఆదా చేసుకొనే అవకాశం ఉంది. ఎక్స్ఛేంజ్‌ సదుపాయాన్ని కల్పించడం లేదు. సిటీ బ్యాంక్ క్రెడిట్ EMI లావాదేవీలతో కనీసం రూ.5000 కొనుగోలుపై రూ.1,250 వరకు 10 శాతం తక్షణ తగ్గింపును దక్కించుకొనే వీలు ఉంది. Samsung Galaxy M52 5G స్మార్ట్‌ఫోన్‌ ధర ఇప్పుడు రూ.24,999గా ఉంది. గతంలో రూ.34,999గా ఉన్న స్మార్టఫోన్‌ ధర ఇప్పుడు తగ్గింది. అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లపై 29 శాతం తగ్గింపును అందిస్తోంది. రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం సూచించిన కార్డ్‌లపై నో కాస్ట్ EMI పొందవచ్చు. అదనంగా ప్రీమియర్ సభ్యులు 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ,  SBC క్యాష్‌బ్యాక్ కార్డ్ లావాదేవీలపై 5 శాతం తక్షణ తగ్గింపును పొందే సదుపాయం కల్పిస్తోంది.  Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.26,999గా ఉంది. 6GB RAM, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.31,999. ప్రస్తుతం దీనిపై 16 శాతం తగ్గింపుతో రూ.26,999కే సొంతం చేసుకొనే అవకాశం ఉంది. ప్రైమ్ మెంబర్స్ 6 నెలల ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ అందుకుంటారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ అందుబాటులో లేదు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై (అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మినహా) కనీస కొనుగోలు మొత్తం రూ.20000లపై కంపెనీ ఫ్లాట్ రూ.2000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. iQOO Z5 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.23,990గా ఉంది. దీని సాధారణ ధర రూ.29,999గా ఉండగా ప్రస్తుతం 20 శాతం తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. కనీసం రూ.5000 కొనుగోలుపై సిటీ బ్యాంక్ క్రెడిట్ EMI లావాదేవీలతో, ఈ-కామర్స్ దిగ్గజం రూ.1,250 వరకు 10 శాతం తక్షణ తగ్గింపును వినియోగదారులకు అందిస్తోంది. అదనంగా HSBC క్యాష్‌బ్యాక్ కార్డ్ లావాదేవీలపై 5 శాతం తక్షణ తగ్గింపును వినియోగదారులు పొందవచ్చు. 

Post a Comment

0 Comments