Ad Code

ఒకే నెంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌..!


ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునేలా 'మల్టీడివైజ్ సపోర్ట్‌'  ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు ప్రైమరీ అకౌంట్‌ కాకుండా ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌లలో లాగిన్‌ అయ్యే సదుపాయాన్ని కల్పించింది. అయితే, తాజాగా ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను రెండు స్మార్ట్‌ఫోన్లలో వాడే సదుపాయాన్ని కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. వాట్సాప్‌ 'మల్టీ డివైజ్‌ సపోర్టు' సేవలను విస్తరించనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌కు అదనపు హంగులు జోడించాలని వాట్సాప్‌ భావిస్తోంది. యూజర్లు ప్రైమరీ మొబైల్‌ల్లోనే కాకుండా మరో ఫోన్‌/ట్యాబ్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేసే సదుపాయాన్ని త్వరలోనే తీసుకురానుంది. ఈ ఫీచర్‌ సాయంతో వాట్సాప్‌ అకౌంట్‌ను మరో ఫోన్‌కు లింక్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌ బీటా 2.22.10.13 వెర్షన్‌లలో ఈ ఫీచర్‌ పనిచేయనుందని సమాచారం. దీనికోసం వాట్సాప్‌ ప్రైమరీ అకౌంట్‌ ఉన్న మొబైల్‌ నుంచి లింక్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. సెకండరీ మొబైల్‌లో వాట్సాప్‌ ఓపెన్ చేసినప్పుడు 'రిజిస్టర్ డివైజ్ యాజ్‌ కంపానియన్ ' అనే ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలని వాబీటాఇన్ఫో పేర్కొంది. అయితే, ఈ ఫీచర్‌ ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని.. ఫైనల్‌ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చే సమయానికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. కాగా.. ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లలో కనెక్ట్ అయినప్పుడు యూజర్ డేటాకు వాట్సాప్ ఎలాంటి భద్రత కల్పిస్తుందనే దానిపై స్పష్టత రాలేదు.

Post a Comment

0 Comments

Close Menu