Ad Code

స్మార్ట్ ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు ?


చాలా మంది వినియోగదారులు డ్యూయల్ సిమ్ ఫోన్‌లు వాడుతున్నారు. దీంతో రెండు మొబైల్ నెంబర్స్ మెయింటైన్ చేసేవారు ఉంటారు. వీటిలో ఒక నంబర్‌ను పర్సనల్ అవసరాలకు, మరొక నంబర్‌ను ఆఫీస్ అవసరాల కోసం వాడుతుంటారు. స్మార్ట్ ఫోన్‌లో రెండు సిమ్ కార్డులు ఉంటున్నాయి కాబట్టి రెండు వాట్సప్ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు ఉపయోగించాలంటే థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు షావోమీ, రియల్‌ మీ, శాంసంగ్, ఒప్పో, వివో వంటి పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు స్మార్ట్ ఫోన్‌లు డ్యూయల్ యాప్స్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. అంటే ఒకే యాప్‌ను రెండు యాప్స్‌గా ఉపయోగించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీని కోసం ముందుగా స్మార్ట్ ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి షావోమీ యూజర్స్ అయితే డ్యూయల్ యాప్స్, ఒప్పో యూజర్లు అయితే క్లోన్ యాప్స్, శాంసంగ్ యూజర్లు అయితే డ్యూయల్ మెసెంజర్, వివో యూజర్లు యాప్ క్లోన్, ఏసుస్ యూజర్లు అయితే ట్విన్ యాప్స్ అనే ఆప్షన్ కోసం సెర్చ్ చేయాలి. తరువాత వాటిలో వాట్సాప్ యాప్ సెలెక్ట్ చేసిన  తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్ యాప్స్ కనిపిస్తాయి. ఒక యాప్‌లో ఒక నెంబర్, మరో యాప్‌లో రెండో నెంబర్‌తో లాగిన్ కావాలి. అయితే ఒక వాట్సాప్ అకౌంట్‌కు ఒక నెంబర్‌ను మాత్రమే వాడుకోవాలి. అంటే ఒక మొబైల్ నెంబర్‌తో వాట్సాప్‌ అకౌంట్‌లో లాగిన్ అయిన తర్వాత రెండో నెంబర్ ఉపయోగించడానికి కుదరదు. అప్పుడు రెండో యాప్ ఇన్‌స్టాల్ చేయాల్సిందే.

Post a Comment

0 Comments

Close Menu