Ad Code

యాపిల్‌ స్మార్ట్‌ వాటర్‌ బాటిల్ !


ప్రస్తుతం స్మార్ట్‌ గ్యాడ్జెట్ల హవా నడుస్తోంది. ఇంట్లో ఉపయోగించే ప్రతీ వస్తువు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. టీవీ నుంచి కారు వరకు, ఇంట్లో ఉపయోగించే కాలింగ్ బెల్‌ నుంచి బల్బుల వరకు అన్ని స్మార్ట్‌ రూపంలోకి మారిపోయాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం యాపిల్‌ మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ బాటిల్స్‌ను కూడా తీసుకొచ్చాయి. పేరుకు తగ్గట్లుగానే ఈ వాటర్‌ బాటిల్‌ చాలా స్మార్ట్‌గా పనిచేస్తాయి. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ బాటిల్స్‌ను త్వరలోనే ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. హైడ్రేట్ స్పార్క్‌ అనే కంపెనీతో భాగస్వామ్యమై యాపిల్‌ ఈ వాటర్‌ బాటిల్స్‌ను విక్రయిస్తోంది. ఈ బాటిల్‌ సహాయంతో యూజర్లు యాపిల్‌ హెల్త్‌ యాప్‌ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ఈ బాటిల్‌కు అందించిన ఎల్‌ఈడీ లైట్‌ ఆధారంగా యూజర్లు రోజులో ఎన్ని నీళ్లు తాగుతున్నారు లాంటి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది. బ్లూటూత్‌ ఆప్షన్‌ ద్వారా హైడ్రేట్‌స్పార్క్‌ యాప్‌కు అనుసంధానం అయ్యే ఈ బాటిల్స్‌ యూజర్ల రోజువారీ యాక్టివిటీ ఆధారంగా నీటిని తీసుకోమని సూచిస్తుంటుంది. అంతేకాకుండా యూజర్లు రోజులో ఎంత నీరు తాగారు అన్న వివరాలు కూడా ఎప్పటికప్పుడు యాప్‌లో సూచిస్తుంది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌లను కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ వివరాలు నిక్షిప్తమవుతాయి. ఈ వాటర్‌ బాటిల్ ధర విషయానికొస్తే స్టీల్‌తో రూపొందించిన బాటిల్‌ రూ. 6,129కి అందుబాటులో ఉండగా, ప్లాస్టిక్‌ బాటిల్‌ రూ. 4,596గా ఉంది. గ్రీన్‌, బ్లాక్‌లో కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu