స్కూళ్ల నుంచి ఆఫీసుల వరకు ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్‌లపై చాలా పని జరుగుతోంది. ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, మీ ల్యాప్‌టాప్ అకస్మాత్తుగా షట్ డౌన్ అవ్వడం లేదా యాప్‌లు మరియు వెబ్‌పేజీలు నెమ్మదించడం వంటి సమస్యలు అనేక మందికి ఎదురవుతుంటాయి. వాటిని పరిష్కరించుకోవాలంటే స్మార్ట్‌ఫోన్‌ల స్పీడ్ ను పెంచుకోవడానికి వినియోగిస్తున్న చిట్కాలే ల్యాప్‌టాప్‌లకు కూడా వర్తిస్తుంది. ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు, దాని వర్జినల్ ఛార్జర్‌ని ఉపయోగించాలి. ఛార్జర్ పాడైపోయినా లేదా సరిగ్గా పని చేయకపోయినా అధికారిక స్టోర్ నుండి మాత్రమే కొత్త ఛార్జర్‌ని కొనుగోలు చేయాలి. లోకల్ ఛార్జర్ ఉపయోగిస్తే ల్యాప్‌టాప్ వేగం తగ్గుతుంది. డూప్లికేట్ ఛార్జర్‌లకు దూరంగా ఉండాలి. ల్యాప్‌టాప్‌లో గేమ్స్ ఆడకూడదు. గేమింగ్ కోసం సాధారణ ల్యాప్‌టాప్‌లను వినియోగిస్తే అది త్వరగా చెడిపోతుంది. స్పీడ్ కూడా పడిపోతుంది. సాధారణ ల్యాప్ టాప్ లలో గేమ్స్ ఆడితే అది స్లో అయి హ్యాంగింగ్ సమస్య మొదలవుతుంది. అనవసరమైన ఫైల్స్ ను కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. .
ల్యాప్ టాప్ - స్లో సమస్య - పరిష్కారం
0
April 08, 2022
Tags