Ad Code

బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి ఉన్నచోటే రోబోటిక్‌ చికిత్స


బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి వెంటనే చికిత్స చేయాలి. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు నగరానికి వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటివారికోసమే అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. స్ట్రోక్ చికిత్స కోసం టెలిరోబోటిక్ సిస్టంను ఆవిష్కరించారు. ఇది స్ట్రోక్ రోగుల్లో టెలిఆపరేటెడ్ ఎండోవాస్కులర్ చికిత్సను సులభతరం చేస్తుంది. ఇందుకోసం పరిశోధకులు రిమోట్‌తో నిర్వహించగల రొబోటిక్ చేయిని రూపొందిస్తున్నారు. స్ట్రోక్‌కు గురైన వ్యక్తిని మారుమూల ప్రాంతం నుంచి పెద్ద నగరానికి తరలించే బదులు స్థానికంగా ఈ రొబోటిక్ ఆర్మ్‌ను ఉపయోగించవచ్చు. స్థానిక దవాఖానల్లో నర్సులు వీటిని ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. ప్రధాన దవాఖాన నుంచి ప్రముఖ వైద్యులు రోగి పరిస్థితిని లైవ్‌లో చూడొచ్చు. రోబో సాయంతో తక్షణమే చికిత్స అందించవచ్చు’ అని ఎంఐటీ పరిశోధకుడు ప్రొఫెసర్ జువాన్హే జావో తెలిపారు. స్ట్రోక్‌కు గురైన రోగికి గోల్టెన్ అవర్‌లో చికిత్స అందించడమే తమ భవిష్యత్ కల అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ అధ్యయనం “టెలిరోబోటిక్ న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ విత్ మాగ్నెటిక్ మానిప్యులేషన్” పేరుతో సైన్స్ రోబోట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Post a Comment

0 Comments

Close Menu