Ad Code

నలుగురు ప్రైవేట్ వ్యోమగాములతో నింగిలోకి..!


అమెరికాకు చెందిన టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష యాత్రలో రికార్డు నెలకొల్పింది. అంతరిక్షానికి మొట్టమొదటిసారిగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు బయల్దేరారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 11.17 గంటలకు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి స్పేస్ ఎక్స్ సంస్థ ఈ నలుగురు వ్యోమగాములను పంపింది. వీరంతా పదిరోజుల పాటు అంతరిక్ష కేంద్రంలోనే బస చేయనున్నారు. ISS అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ క్రాప్ట్ కూడా ఇదే. భూ కక్ష్యలో వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రల్లో ఇదో మైలురాయిగా నాసా వెల్లడించింది. ఈ రాకెట్ ప్రయోగానికి 25 అంతస్తుల ఎత్తు కలిగిన భారీ వ్యోమనౌకను వినియోగించారు. 'ఆక్సియమ్​-1' మిషన్ విజయవంతంగా మొదలైందని నాసా తెలిపింది. ఈ మిషన్​కు నాసా మాజీ ఆస్ట్రోనాట్​ మైకేల్​ లోపెజ్​ అలెగ్రియా కమాండింగ్​ ఆఫీసర్​గా వ్యహరిస్తున్నారు. ఈ నలుగురు వ్యోమగాముల్లో అమెరికాకు చెందిన రియల్​ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కానర్, ఇజ్రాయెల్ మాజీ పైలట్, ఎంట్రప్రెన్యూర్ ఈటాన్ స్టీబా, కెనడా బిజినెస్​మ్యాన్ మార్క్ పాథీ ఉన్నారు. ఈ నలుగురు వ్యోమగాములంతా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఎనిమిది రోజుల పాటు ఉంటారు. అంతరిక్షంలో వయసుపై కలిగే ప్రభావాలు, పరిశోధనలు, సెల్ఫ్​ అసెంబ్లింగ్​ స్పేస్​క్రాఫ్ట్​ టెక్నాలజీ డెమాన్​స్ట్రేషన్ వంటి ప్రయోగాలను చేయనున్నారు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఈ వ్యోమగాములు 20 గంటల ప్రయాణం చేయనున్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోనున్నారు. ఈ రాకెట్ నుంచి విడిపోయిన అనంతరం ఆటో సెర్చింగ్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ భూమికి 400 కి.మీ. ఎత్తులో ISSకు ఇంటర్ లింక్ అవుతుంది. ఈ అంతరిక్ష యాత్ర కోసం ఒక్కొక్కరూ సుమారు రూ.417.30 కోట్లు (రూ.5.5 కోట్ల డాలర్లు) చెల్లించినట్టు తెలిసింది. అంతరిక్షంలోకి వెళ్తున్న వీరంతా ఎంజాయ్ చేసేందుకు వెళ్లడం లేదట.. పూర్తి సైంటిఫిక్​ పరిశోధనలు చేస్తారని ఆక్సియమ్​ స్పేస్​ ఆపరేషన్స్​ డైరెక్టర్​ డెరెక్​ హాస్మాన్​ వెల్లడించారు. నాలుగు ప్రైవేట్ ​మిషన్స్​ చేసేందుకు ఆక్సియమ్​తో నాసా డీల్ కుదుర్చుకుంది.

Post a Comment

0 Comments

Close Menu