గూగుల్‌ సెర్చ్‌లో మీ మొబైల్ నంబర్‌ కనిపిస్తుందా ?


గూగుల్ సెర్చ్ లో మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుందా? అయితే తస్మాత్ జాగ్రత్త ! గూగుల్ సెర్చ్‌లో ఇండెక్స్ అయిన మొబైల్ నెంబర్‌ సహా ఇతర వ్యక్తిగత వివరాలను డిలీట్ చేసుకోవచ్చు. చాలామందికి తమ మొబైల్ నెంబర్ గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తుందని తెలియకపోవచ్చు. మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలను ఏదో ఒకచోట ఆన్ లైన్లలో ఇచ్చి ఉంటారు. అలా మీ వ్యక్తిగత వివరాలు గూగుల్ లో బహిర్గతమవుతుంటాయి. గూగుల్ లో స్టోర్ అయిన మీ పర్సనల్ వివరాలను డిలీట్ చేయాల్సిందిగా గూగుల్ కు అనేక అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ యూజర్ల అభ్యర్థనల మేరకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ఫోన్ నెంబర్లు, చిరునామా వంటి వివరాలను డిలీట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గూగుల్ సెర్చ్‌లో ఆర్థికపరమైన వివరాలను మాత్రమే డిలీట్ చేయమని అభ్యర్థనలు వచ్చేవి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను గూగుల్ డిలీట్ చేస్తోంది. ఇటీవలే గూగుల్ పాలసీని మార్చేసింది. ఆ స్థానంలో కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లాంటి వ్యక్తిగత వివరాలను గూగుల్ సెర్చ్ నుంచి తొలగించేందుకు గతంలో అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఆ వెసులుబాటును కల్పిస్తున్నట్టు గూగుల్ బ్లాగ్‌స్పాట్‌లో తెలిపింది. ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీ వివరాలను డిలీట్ చేయాలంటూ అభ్యర్థనలు వెల్లువెత్తడంతో గూగుల్ ఈ మేరకు డిలీట్ చేయాలని నిర్ణయం తీసుకుందని గూగుల్ గ్లోబల్ పాలసీ హెడ్ మిచెల్లీ చాంగ్ తెలిపారు. గూగుల్‌ సెర్చ్‌లో మీ వ్యక్తిగత వివరాలను తొలగించాలంటే మీ కోసం గూగుల్ వెబ్ పేజీలను ఫిల్టర్ చేస్తుంది. మీ వ్యక్తిగత వివరాలు ఏదైనా ప్రభుత్వ వెబ్ సైట్లో ఉంటే మాత్రం గూగుల్ ఆ వివరాలను తొలగించలేదు. గూగుల్ సెర్చ్ లో కనిపించే వివరాలను మాత్రమే డిలీట్ చేయగలదు. వాస్తవానికి మీ వివరాలు పూర్తిగా ఇంటర్నెట్‌ నుంచి తొలగిపోవని గుర్తించుకోవాలి. ఎందుకో తెలుసా.. గూగుల్‌ మాదిరి అనేక సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. ఆ సెర్చ్‌ రిజిల్ట్స్‌లో మీ పర్సనల్ డేటా కనిపించే అవకాశం లేకపోలేదు. మీ ఫోన్‌ నంబర్‌ నమోదు చేసుకున్న వెబ్‌సైట్‌ను సంప్రదించండి. మీ వ్యక్తిగత వివరాలను తొలగించాలని చెప్పండి. అప్పుడు మాత్రమే మీ వివరాలను ఆయా గూగుల సెర్చ్ లో నుంచి తొలగించే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments