Ad Code

12 లక్షల యాప్స్ నిషేధం!


ప్రతి సంవత్సరం యూజర్ల భద్రత కోసం గూగుల్ పాలసీని ప్రకటిస్తుంది. హానికరమైన యాప్స్ నుంచి యూజర్లకు మెరుగైన భద్రత కల్పిం చడం కోసం ఈసారి 12 లక్షల యాప్‌లను నిషేధించినట్లు గూగుల్ ప్రకటించింది. పాలసీలకు విరుద్ధం గా ఉన్న యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుం చి తొలగిం చినట్లు వెల్లడించింది. అంతే కాకుండా 2021లో మోసపూరిత, స్పామ్ డెవలపర్లను నియంత్రించడానికి 1.90 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ మాల్‌వేర్, షార్క్‌బాట్ మాల్‌వేర్, మాల్‌వేర్ యాప్స్, గూగుల్ ప్లేస్టోర్, ఆండ్రాయిడ్ మాల్‌వేర్" దీంతో పాటు ఇన్ యాక్టీవ్‌గా ఉన్న దాదాపు 5 లక్షల ఖాతాలను నిలిపి వేసినట్లు గూగుల్ ప్రకటించింది. వైరస్, మాల్వేర్ ఇతర సమస్య లు ఉన్న ప్పు డు గూగుల్ కొన్ని యాప్స్ ను ప్లే స్టోర్ నుం చి తొలగిస్తూ ఉం టుంది. అంతే కాకుండా ముఖ్యంగా యూజర్ల భద్రతా కారణాల దృష్ట్యా వీటిని నిషేధిస్తున్నట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ''మాల్వేర్, హానికరమైన సాఫ్ట్వేర్ల నుంచి యూజర్లకు రక్షణ కల్పిం చడానికి బిలియన్ల కొద్దీ ఇన్స్టాల్ చేసుకున్న యాప్లను ఎప్ప టికప్పు డు స్కా న్ చేస్తూనే ఉన్నాం '' అని పోస్టులో వెల్లడించింది.  నిషేధిత యాప్లు ఇంకా మీ ఫోన్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోవాలం టే గూగుల్/యాప్ స్టోర్లోకెళ్లి యాప్ల వివరాలు సరిచూసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మీ ఫోన్‌లో ఆ యాప్‌లు ఉంటే మొబైల్స్ నుంచి ఆ యాప్‌ను వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాలని గూగుల్ సూచిస్తోంది. కొత్త కుకీస్‌ ఆప్షన్స్ పాలసీని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త పాలసీ డిసీజన్స్ తీసుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో యూరోపియన్ రెగ్యులేటర్‌ల ఆదేశాలతో 150 మిలియన్‌ యూరోలను గూగుల్‌ చెల్లించింది. ఆ తర్వాత యూరప్‌లో 'రిజెక్ట్‌ ఆల్‌ కుకీస్‌' బటన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  యూరప్‌లో సైన్ అవుట్ చేసినప్పుడు లేదా ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉన్నప్పుడు గూగుల్‌, యూట్యూబ్‌ను ఓపన్‌ చేస్తే అప్‌డేటెడ్‌ కుకీస్‌ డైలాగ్‌ బాక్స్‌ కనిపిస్తుంది. రిజెక్ట్‌, యాక్సెప్ట్‌ ఆల్‌ బటన్లు ఉంటాయి. యూజర్‌ కంప్యూటర్‌లో వినియోగించే వెబ్‌ బ్రౌజర్‌లో స్టోర్‌ అయ్యే చిన్న డేటాను కుకీ అంటారు. దీని ద్వారా ఆయా వెబ్‌సైట్‌లను యూజర్‌ ముందే వినియోగించారా? ఎలాంటి ఆప్షన్స్‌ ఎంచుకొన్నారు? ఎలాంటి విషయాల కోసం ఉపయోగించారు? వంటి వివరాలు స్టోర్‌ అవుతాయి.

Post a Comment

0 Comments

Close Menu