Ad Code

వివో టీ2 త్వరలో విడుదల ?


ఈ ఏడాది సిరీస్ టీ స్మార్ట్‌ఫోన్లను వివో పరిచయం చేసింది. ఫిబ్రవరిలో రిలీజైన వివో టీ1 మొబైల్ బాగా పాపులర్ అయింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. సేల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు క్రేజ్ ఎక్కువగా కనిపించింది. దీంతో ఇదే సిరీస్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది కంపెనీ. వివో టీ1 ప్రో, వివో టీ1 44w  మోడల్స్‌ని పరిచయం చేసింది. రూ.25,000 లోపు బడ్జెట్‌లో వివో టీ1 ప్రో, రూ.20,000 లోపు బడ్జెట్‌లో వివో టీ1, రూ.15,000 లోపు బడ్జెట్‌లో వివో టీ1 44w అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇదే సిరీస్‌లో కొత్త మోడల్ రాబోతోంది. వివో టీ1 అప్‌గ్రేడ్ వేరియంట్ వివో టీ2 రాబోతోంది. చైనాలో మే 23న వివో టీ2 రిలీజ్ కానుంది. ఆ తర్వాత భారతదేశంతోపాటు ఇతర దేశాల్లో ఈ మొబైల్ అందుబాటులోకి వస్తుంది. చైనాకు చెందిన వెబ్‌సైట్‌లో ఇప్పటికే వివో టీ2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి డెడికేటెడ్ పేజీ కనిపించింది. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండబోతోంది. చైనాలో రిలీజైన ఐకూ నియో 6 ఎస్ఈ రీబ్రాండెడ్ వర్షన్ లాగా వివో టీ2 ఉండొచ్చని భావిస్తున్నారు. వివో టీ2 మూడు స్టోరేజ్ వేరియంట్లలో రిలీజ్ కానుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.23,000 ధరలో, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.26,500 ధరలో, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.28,850 ధరలో లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇవి చైనాలో ధరలు మాత్రమే. ఇండియాలో ఇంతకన్నా తక్కువ ధరకే వివో టీ2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. వివో టీ2 మొబైల్ ఇతర స్పెసిఫికేషన్స్ చూస్తే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ కెమెరా, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉండొచ్చని అంచనా. ఇండియాలో బాగా పాపులర్ అయిన వివో టీ1 స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో టీ1 మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990.

Post a Comment

0 Comments

Close Menu