Ad Code

మే 4 న విడుదలకానున్న వివో కొత్త ఫోన్లు


ఇండియాలో వివో కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఇండియాలో ప్రవేశపెట్టిన Vivo T1 5G యొక్క Pro వెర్షన్ మరియు 44W వెర్షన్ రెండు స్మార్ట్ ఫోన్లను మే 4న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క కీలకమైన ఫీచర్లు మరియు స్పెషిఫికేషన్స్ ను కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo T1 Pro 5G ను మే 4వ తేదీ మద్యహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేయడానికి డేట్ ప్రకటించింది. 6nm ఫ్లాగ్ షిప్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్ Snapdragon 778G తో తీసుకువస్తోంది. అంతేకాదు, వివో టి1 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 66W టర్బో ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఛార్జింగ్ టెక్ తో ఈ ఫోన్ కేవలం 18 నిముషాల్లోనే 50% వరకూ ఛార్జ్ చెయ్యగలదని కూడా వివో చెబుతోంది. Antutu బెంచ్మార్క్ని పరీక్షించడం కోసం 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ని ఫోన్లో ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS సాఫ్ట్వేర్ తో వస్తుందని అంటున్నారు. Vivo T1 44W విషయానికి వస్తే, ఇది కొంచెం తక్కువ స్పెక్స్డ్ ఫోన్ అయినప్పటికీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బహుశా 5,000mAh బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 680 SoC, AMOLED స్క్రీన్ మరియు ఆండ్రాయిడ్ 12 ఆధారిత Funtouch OS వంటి ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu