Ad Code

రూ.4,000 డిస్కౌంట్‌తో షావోమీ ట్యాబ్లెట్


షావోమీ ఇండియా నుంచి ఇటీవల ట్యాబ్లెట్ రిలీజైంది. షావోమీ ప్యాడ్ 5 ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. షావోమీ 12 ప్రో  స్మార్ట్‌ఫోన్‌తో పాటు షావోమీ ప్యాడ్ 5 ట్యాబ్లెట్‌ను రిలీజ్ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ట్యాబ్లెట్స్ కొనేవారి సంఖ్య పెరిగింది. లాక్‌డౌన్ నుంచి వీడియో కంటెంట్ చూసే అలవాటు పెరగడం, పెద్ద స్క్రీన్ ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ట్యాబ్లెట్స్ కొంటున్నారు. అయితే ఇప్పటికే నోకియా టీ20, రియల్‌మీ ప్యాడ్, లెనోవో ట్యాబ్ పీ11 మోడల్స్ రిలీజ్ అయ్యాయి. షావోమీ కాస్త ఆలస్యంగా ట్యాబ్లెట్ తీసుకొచ్చింది. చాలా ఏళ్ల తర్వాత షావోమీ ఇండియాకు ట్యాబ్లెట్ తీసుకురావడం విశేషం. షావోమీ ప్యాడ్ 5 ట్యాబ్లెట్ కొంతకాలం క్రితమే గ్లోబల్ మార్కెట్‌లో రిలీజైంది. అప్పటి నుంచి ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు ఇండియాలో రిలీజ్ అవుతుందా అని షావోమీ ఫ్యాన్స్ ఎదురుచూశారు. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో రిలీజైన షావోమీ ప్యాడ్ 5 ట్యాబ్లెట్‌లో క్వాడ్ స్పీకర్స్, భారీ బ్యాటరీ, స్టైలస్ సపోర్ట్ ఉండటం విశేషం. షావోమీ ప్యాడ్ 5 ట్యాబ్లెట్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు, 6జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.26,999 ధరకు అమ్ముతోంది షావోమీ. మే 7 వరకు ఇవే ధరలు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిస్కౌంట్ కలిపి మొత్తం రూ.4,000 డిస్కౌంట్ లభిస్తోంది. రూ.4,000 డిస్కౌంట్‌తో షావోమీ ప్యాడ్ 5 ట్యాబ్లెట్ కొంటే 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు, 6జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 10.9 అంగుళాల WQHD+ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 13మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. క్వాడ్ స్పీకర్స్‌కు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 8720ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ లభిస్తుంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ట్యాబ్లెట్ బరువు 511 గ్రాములు. షావోమీ ప్యాడ్ 5 ట్యాబ్లెట్‌కు డిటాచబుల్ కీబోర్డ్, స్టైలస్ సపోర్ట్ ఉన్నాయి. వీటిని వేరుగా కొనాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌కు సిమ్ కార్డ్ సపోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్, మెమొరీ కార్డ్ సపోర్ట్ లేవు.

Post a Comment

0 Comments

Close Menu