మదర్స్ డే గిఫ్ట్ రూ.5,000 లోపే వాషింగ్ మెషీన్ !


ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 8న ముగియనుంది. ఈ సేల్‌లో వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మీ ఇంట్లోకి వాషింగ్ మెషీన్ కొనాలన్నా, ఈ మదర్స్ డేకి మీ తల్లికి వాషింగ్ మెషీన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ అయిన మార్‌క్యూ వాషింగ్ మెషీన్ ధర కేవలం రూ.5,190 మాత్రమే. ఆఫర్‌లో ఇంకా తక్కువ ధరకే వాషింగ్ మెషీన్ కొనొచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.519 డిస్కౌంట్ పొందొచ్చు.  ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్‌తో మార్‌క్యూ వాషింగ్ మెషీన్‌ను కేవలం రూ.4,671 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొన్నా ఈ ఆఫర్ లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ కొన్నవారికి ఉచితంగా ఆరు నెలల గానా ప్లస్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్స్ వివరాలు చూస్తే కేవలం రూ.180 మంత్లీ ఈఎంఐ ఆప్షన్‌తో ఈ వాషింగ్ మెషీన్ సొంతం చేసుకోవచ్చు. మార్‌క్యూ వాషింగ్ మెషీన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.. మీ ఇంట్లో పాత వాషింగ్ మెషీన్ ఉంటే ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.2,200 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ వాషింగ్ మెషీన్ ఫీచర్స్ చూస్తే ఇది 7.5 కిలోల వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్. అంటే ఇందులో డ్రై ఆప్షన్ ఉండదు. కేవలం దుస్తులు ఉతకడానికి మాత్రమే ఈ వాషింగ్ మెషీన్ పనికొస్తుంది. వాషింగ్ మెషీన్‌తో పాటు ఇన్లెట్ పైప్ లభిస్తుంది. ఇందులో నార్మల్, హెవీ పేరుతో రెండు రకాల వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రెండేళ్ల కాంప్రహెన్సీవ్ వారెంటీ, ఐదేళ్ల మోటార్ వారెంటీ లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ బరువు 12 కిలోలు మాత్రమే. 


Post a Comment

0 Comments