Header Ads Widget

5G టెస్ట్ బెడ్ ప్రారంభించిన ప్రధాని మోదీ


టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రజతోత్సవ వేడుకల్లో భాగంగా 5G టెస్ట్ బెడ్ ప్రారంభించారు. ట్రాయ్ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పోస్టల్ స్టాంప్, ట్రాయ్ సావనీర్, షార్ట్ ఫిల్మ్‌ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 5జీ టెస్టింగ్ సదుపాయాలు లేని దేశాలకు స్టార్టప్స్ వెళ్లి 5జీ మొబైల్ నెట్వర్క్‌ను  పరీక్షించేందుకు 5G టెస్ట్ బెడ్ ఉపయోగపడుతుంది. ట్రాయ్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 5జీ టెస్ట్ బెడ్ అభివృద్ధి చేయడంలో భాగ్వస్వాములుగా ఉన్నవారందరికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. టెలికాం రంగంలోని కంపెనీలన్నీ తమ 5జీ ప్రొడక్ట్స్‌ని, సేవల్ని టెస్ట్ బెడ్ ద్వారా పరీక్షించాలని ప్రధాని మోదీ కోరారు. 5G టెస్ట్ బెడ్ టెక్నాలజీని 8 ప్రతిష్టాత్మక సంస్థలు కలిసి రూపొందించాయి. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబ్, ఐఐటీ కాన్‌పూర్, ఐఐఎస్‌సీ బెంగళూరు, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్‌వైర్‌లెస్ టెక్నాలజీ లాంటి సంస్థలన్నీ కలిపి 5G టెస్ట్ బెడ్ రూపొందించడంలో కీలకంగా వ్యవహరించాయి. 300 ఇంజనీర్లు, 40 మంది శాస్త్రవేత్తలు కలిసి మొత్తం 224 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టడం విశేషం. 5జీ టెక్నాలజీని పూర్తి స్థాయిలో పరీక్షించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. స్టార్టప్స్ తమ 5జీ ప్రొడక్ట్స్‌ని, సేవల్ని పరీక్షించేందుకు ఇది గొప్ప అవకాశం అని మోదీ అన్నారు. భారతదేశానికి చెందిన 5జీ స్టాండర్డ్, 5జీఐ టెక్నాలజీని ప్రశంసించారు. ఇవి భారతదేశంలోని గ్రామాలకు 5జీ టెక్నాలజీని అందించడంలో ఉపయోగపడతాయన్నారు. 21 శతాబ్దంలో భారతదేశ ప్రగతి వేగాన్ని కనెక్టివిటీ నిర్ణయిస్తుందని అన్నారు. 5జీ టెక్నాలజీ పరిపాలనలో సహేతుకమైన మార్పు తీసుకొస్తుందని, భారతదేశంలో సులభంగా జీవించడంతో పాటు సులభంగా వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుందని, రాబోయే 15 ఏళ్లలో 5జీ టెక్నాలజీ 450బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. దేశం లోని కంపెనీలు, స్టార్టప్స్ తమ 5జీ ప్రొడక్ట్స్, ప్రోటోటైప్స్, సొల్యూషన్స్, ఆల్గరిథమ్స్, నెక్స్ట్ జెనరేషన్ టెక్నాలజీస్‌ను పరీక్షించేందుకు 5G టెస్ట్ బెడ్ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఇందులో 5జీ నెట్వర్క్‌తో పాటు ట్రాన్స్‌పోర్ట్ పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయి. 40జీబీపీఎస్ స్పీడ్‌తో 10,000 పైగా డివైజ్‌లకు సపోర్ట్ లభిస్తుంది.

Post a Comment

0 Comments