Ad Code

అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఐకూ జెడ్6 ప్రో 5జీ పై డిస్కౌంట్‌


ఐకూ ఇండియా ఐకూ జెడ్ సిరీస్‌లో ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై మంచి ఆఫర్ లభిస్తుంది. ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ కూపన్ ఆఫర్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం కలిపి రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డుతో కొంటే 7.5 శాతం, హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డుతో 7.5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి ఆఫర్స్ ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ రూ.3,000 నుంచి ప్రారంభం అవుతుంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనాలనుకునేవారికి రూ.18,450 డిస్కౌంట్ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.18,450 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే మీరు బేస్ వేరియంట్‌ను రూ.5,549 ధరకు సొంతం చేసుకోవచ్చు. మీ మొబైల్‌కు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ తక్కువ లభిస్తే మిగతా మొత్తం చెల్లించాలి. ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల బాగా పాపులర్ అయిన ప్రాసెసర్ ఇది. ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 66వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ లభిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu