Ad Code

ఐక్యూ నియో 6 SE ఫోన్ విడుదల !


దేశీయ మార్కెట్లోకి వివో సబ్‌బ్రాండ్‌గా ఫేమస్ అయిన ఐక్యూ వరుసగా కొత్త ఫోన్లను  విడుదల చేస్తోంది. ప్రస్తుతం స్వతంత్ర సంస్థగా పనిచేస్తున్న ఐక్యూ ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ లైనప్‌ను యాడ్ చేసింది. కొత్తగా ఐక్యూ నియో 6 ఎస్‌ఈ పేరుతో మిడ్ రేంజ్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వనిల్లా ఐక్యూ నియో 6 స్మార్ట్‌ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రిలీజైంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 800 సిరీస్ చిప్‌సెట్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా బిల్ట్ చేసిన OriginOS వెర్షన్‌పై ఫోన్ రన్ అవుతుంది. OIS సపోర్ట్ ఉన్న 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా దీని స్పెషాలిటీ. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీతో వచ్చింది. ఐక్యూ నియో 6 SE స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ అయిన 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,000) నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 256GB మోడల్‌ ధర CNY 2,299 (సుమారు రూ. 26,500)గా ఉంది. 12GB RAMతో వచ్చిన టాప్ ఎండ్ వేరియంట్ మార్కెట్‌లో సుమారు రూ. 28,800 ధరకు లభిస్తుంది. ప్రస్తుతానికి ఐక్యూ నియో 6 SE చైనాలో లాంచ్ అయింది. ఇది వచ్చే వారం నుంచి చైనాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ బ్రాండ్‌ను ఇండియాతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఐక్యూ నియో 6 SE అనేది రెగ్యులర్ iQOO Neo 6 వాటర్ డౌన్డ్ వెర్షన్‌గా వచ్చింది. ఇది చాలా మంది వినియోగదారులకు మంచి మిడ్ రేంజ్ ఫోన్ ఆప్షన్‌గా మారనుంది. ఈ ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.62 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1300 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. బేస్ మోడల్ మాత్రం 8 GB RAM, 128 GB స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Snapdragon 870 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది మంచి పర్ఫార్మెన్స్ అందించే చిప్‌సెట్‌గా ఫేమస్ అయింది. ఐక్యూ నియో 6 SE ఫోన్ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ OriginOS ఓషన్ వెర్షన్‌ ఆధారంగా పనిచేస్తుంది. డివైజ్‌లో OIS సపోర్ట్‌ ఉన్న 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ వంటి బెస్ట్ క్వాలిటీ లెన్స్ ఉన్నాయి. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ షూటర్ యూజర్లను ఆకర్షించనుంది. ఐక్యూ నియో 6 SE ఫోన్ 4700mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu