Ad Code

మెడికల్ డ్రోన్లు


దేశ వైద్యరంగ సేవల ముఖ చిత్రాన్ని డ్రోన్లు సమూలంగా మార్చబోతున్నాయి. ప్రజలకు వైద్య సేవలను వేగంగా అందించేందుకు కీలక మాధ్యమంగా ఉపయోగపడనున్నాయి. వైద్య పరీక్షల కోసం రోగుల ఇళ్లకు వెళ్లి శాంపిళ్లను కలెక్ట్ చేయడానికి భవిష్యత్ లో డ్రోన్లే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎవరికైనా అత్యవసరంగా బ్లడ్ అవసరమైతే బ్లడ్ బ్యాంక్ నుంచి నేరుగా ఆస్పత్రికి డ్రోన్ లో బ్లడ్ ప్యాకెట్ ను పంపే రోజులూ దగ్గరలోనే ఉన్నాయి. ఇటువంటి వాటిని 2 డిగ్రీల సెల్సీయస్ నుంచి 8 సెల్సీయస్ మధ్య నిల్వ చేసి తీసుకెళ్లేలా డ్రోన్ల లో చిన్నపాటి కోల్డ్ స్టోరేజీ కూడా ఉంది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ అంత మెరుగ్గా ఉండదు. దీంతో అక్కడి మారుమూల ప్రాంతాలకు కోవిడ్ టీకాలను పంపేందుకు డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగించారు. వాస్తవానికి భారత ప్రభుత్వం డ్రోన్ల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను గత సంవత్సరమే సరళతరం చేసింది. అవి దేశంలోని ఏయే రూట్లలో ఎగరాలి ? ఎంత ఎత్తులో ఎగరాలి ? ఏయే ప్రమాణాలు పాటించాలి ? అనే దానిపై స్పష్టత ఇచ్చింది. డ్రోన్ల సేవలకు అనుమతుల కోసం చేసే దరఖాస్తు ప్రక్రియ ను చాలా ఈజీగా మార్చింది. ఈనేపథ్యంలో చాలా డ్రోన్ల ఆపరేటింగ్ కంపెనీలు వాటి కార్యకలాపాలను విస్తరించాయి. ‘ స్కై ఎయిర్ మొబిలిటీ’ అనే కంపెనీ కూడా వీటిలో ఒకటి. మీరట్ నుంచి నోయిడా కు బ్లడ్ శాంపిళ్లను తీసుకెళ్లిన డ్రోన్ వీరి కంపెనీదే. 2021 నవంబరు నుంచి ఇప్పటివరకు ఈ కంపెనీ ఈ-కామర్స్ కంపెనీల ఆర్డర్లు, వైద్య పరీక్షల రిపోర్టులు సహా ఎన్నో వస్తువులను గమ్య స్థానాలకు చేర్చేందుకు దాదాపు 1000 డ్రోన్ సర్వీసులు నడిపింది. అంటే.. డ్రోన్ సర్వీసులకు ఉన్న క్రేజీ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. చాలా డయాగ్నస్టిక్ ల్యాబ్ లు, ఆస్పత్రులు భవిష్యత్ లో ఇటువంటి డ్రోన్ సేవల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా యోచిస్తున్నాయి. ఒకవేళ డ్రోన్ ద్వారా త్వరితగతిన సేవలు కోరుకునే వినియోగదారుల నుంచి ఎక్కువ సేవా రుసుమును వసూలు చేస్తారు.

Post a Comment

0 Comments

Close Menu