Ad Code

కృత్రిమ మాంసం, కోడి గుడ్లు, పాలు, కూరగాయలు ?



కృత్రిమ పంది మాంసం, కృత్రిమ చికెన్, కృత్రిమ గొర్రె మటన్, కృత్రిమ బీఫ్, కృత్రిమ మిడతలు, కృత్రిమ కోడి గుడ్లు, కృత్రిమ సముద్ర నాచు, కృత్రిమ పుట్టగొడుగులు, కృత్రిమ ఆల్గే , కృత్రిమ పాలు, కృత్రిమ బెర్రీలను తయారు చేసే పరిజ్ఞానం అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. దానికి సంబంధించిన పరిశోధనలను అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఫిన్ లాండ్, సింగపూర్, జపాన్ సహా ఎన్నో దేశాలు ఇప్పటికే ప్రారంభించాయి. తాజాగా ఫిన్ లాండ్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి పరిశోధకులు ఇందుకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. ల్యాబ్ లలో తయారయ్యే కృత్రిమ మాంసం , కూరగాయలు, పాలు మానవ ఆరోగ్యానికి చాలా మంచివని తెలిపారు. సహజ మాంసం, కూరగాయలు, పాలల్లో ఉండే పోషకాలే వీటిలోనూ అదే స్థాయిలో ఉంటాయని చెప్పారు. సహజంగా అయితే కూరగాయలను సాగు చేసేందుకు భూమి కావాలి, నీరు కావాలి, ఎరువులు కావాలి, కృత్రిమ కూరగాయల వల్ల ఇవేమీ అవసర లేని పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహజ ఆహార ఉత్పత్తుల వాడకాన్ని మనిషి ఎంతగా తగ్గిస్తే.. వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల అంతగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘ నేచర్ ఫుడ్ ‘ జర్నల్ లో ప్రచురితమైంది.

Post a Comment

0 Comments

Close Menu