Ad Code

ట్విట్టర్ డీల్ కు ఎలాన్ మస్క్ బ్రేక్ !


ట్విట్టర్ ను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఎలాన్ మస్క్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ట్విట్టర్ లో స్పామ్, ఫేక్ అకౌంట్స్ సరియైన సంఖ్యను తెలుసుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు అందుకే టేకోవర్ లావాదేవికి బ్రేక్ ప్రకటిస్తున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు. తమకు యాడ్స్ ఆదాయం సమకూర్చే 23కోట్ల యాక్టివ్ యూజర్లలో ఫేక్, స్పామ్ అకౌంట్స్ సంఖ్య 5 శాతంలోపే ఉంటుందని మే 2న ట్విట్టర్ త్రైమాసిక రిపోర్టులో వెల్లడైంది. అయితే ఈ సంఖ్య 5 శాతం లోపే ఉంటుందా అన్న అనుమానాన్ని మస్క్ వ్యక్తం చేశారు. ఇంతకంటే ఎక్కువగా ఉండొచ్చన్న అంచనా వేశారు. వాస్తవ వ్యక్తులన్ని అనుకరిస్తూ ట్విట్టర్ లో దర్శనమిచ్చే స్పామ్ బోట్స్ సమస్యను పరిష్కరించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మస్క్ ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్లో టెస్లా, ట్విట్టర్, షేర్లు పరస్పర భిన్నమార్గంలో స్పందించాయి. ట్విట్టర్ షేర్ 15శాతం క్షీణించింది. మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 6 శాతంపైగా పెరిగింది. ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే మస్క్ 8 బిలియన్ డాలర్ల టెస్లా షేర్లనువిక్రయించారు. టెస్లా షేర్లను తనఖా చేసి మిగిలిన మొత్తాన్ని సమీకరించే యోచననను ఆయను ఇప్పటికే వెల్లడించారు. ఈ షేర్ల భిన్న స్పందనకుట్విట్టర్ లావాదేవీ జరగబోదన్న అంచనాలే కారణమంటూ విశ్లేషకులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu