వాట్స్అప్ ద్వారా హోమ్ లోన్ !


వాట్స్అప్ ద్వారా హెచ్ డి ఎఫ్ సి  బ్యాంక్ తాజాగా రెండు నిమిషాల్లోనే హోమ్ లోన్ మంజూరు చేయడానికి సిద్ధం అయింది. ప్రస్తుతం ఈ లోన్ పొందడానికి హెచ్ డి ఎఫ్ సి స్పాట్ ఆఫర్ ఆన్ వాట్సాప్ పేరిట కొత్త సర్వీస్ ప్రారంభించిన నేపథ్యంలో స్పాట్ ఆఫర్ లో భాగంగా హోమ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం రెండు నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా హోమ్ లోన్ పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఎవరైతే హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తూ బ్యాంకుల చుట్టూ.. ఫైనాన్స్ సంస్థల చుట్టూ తిరుగుతున్నారో అలాంటి వారు ఇకపై కష్టపడకుండా కేవలం మీ చేతి వేళ్ళ లోని వాట్స్అప్ ద్వారా హోం లోన్ కి అప్లై చేయవచ్చు. హోమ్ లోన్ వాట్సాప్ ద్వారా తీసుకోవాలనుకునే కస్టమర్లు ముందుగా +91 9876000000 ఫోన్ నెంబర్ ను సేవ్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్ లో ఈ నెంబర్ ఓపెన్ చేసి హాయ్ అని టైప్ చేయాలి. ఇక ఆ తర్వాత వారు అడిగిన కొన్ని బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వివరాల ఆధారంగా క్రెడిట్ హిస్టరీని పరిశీలిస్తుంది బ్యాంక్. ఇక మీరు ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని 24 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. లోన్ అప్రూవల్ లెటర్ పొందిన తర్వాత ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదు . కేవలం రెండు నిమిషాల్లోనే మీరు లోన్ పొందవచ్చు . అయితే భారతదేశంలో వేతనం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులోకి ప్రస్తుతం వచ్చింది.

Post a Comment

0 Comments