టెలిగ్రామ్‌లో క్రిప్టోకరెన్సీ పేమెంట్లు


టెలిగ్రామ్ సంస్థ  యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేసింది. ఈ కొత్త అభివృద్ధి బ్లాక్‌చెయిన్ లో మెసేజింగ్ యాప్‌కి కొత్తగా క్రిప్టో పేమెంట్ల ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే ఇతర టెలిగ్రామ్ వినియోగదారులకు క్రిప్టోకరెన్సీ టోన్ కాయిన్ ని పంపడానికి అనుమతిస్తుంది. సుమారు 550 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న టెలిగ్రామ్ ఏయూసీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ నుండి చట్టపరమైన సవాలును ఎదురుకున్న తర్వాత దాని స్వంత టోకెన్ కోసం దాని ప్లాన్‌ను గతంలో విరమించుకుంది. 2019లో టెలిగ్రామ్ తన టోకెన్‌ను అభివృద్ధి చేయడానికి $1.7 బిలియన్ల సేకరణ తరువాత దానిని చట్టవిరుద్ధమైన టోకెన్ సమర్పణగా పేర్కొంటూ ఎస్ఈసీ  దావా వేసింది. టెలిగ్రామ్ తరువాత ఎస్ఈసీకి జరిమానా చెల్లించడమే కాకుండా పెట్టుబడిదారులకు మూలధనాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. అప్పటి నుండి టెలిగ్రామ్ యొక్క సీఈఓ పావెల్ దురోవ్ టెలిగ్రామ్ నుండి స్పష్టమైన మరియు స్వతంత్రంగా ఉన్న ప్రత్యేక స్పిన్-ఆఫ్ టోకెన్ టోన్‌కాయిన్‌ను ఆమోదించడానికి కృష్టి చేస్తున్నారు. దాని యొక్క ఫలితంగానే ఇప్పుడు టెలిగ్రామ్‌లో పేమెంట్స్ కోసం ఇప్పుడు క్రిప్టోకరెన్సీలను ప్రారంభించింది అని నివేదిక పేర్కొంది. "టెలిగ్రామ్‌లోని ఈ ఫంక్షనాలిటీ వినియోగదారుని యొక్క బిజినెస్ పేమెంట్ల వరకు విస్తరిస్తుందని మేము అంచనా వేస్తున్నాము. తద్వారా ప్రజలు టెలిగ్రామ్ యాప్‌లోని బాట్‌ల ద్వారా టన్‌కాయిన్‌ను పంపడం ద్వారా అన్ని రకాల సేవలను సులభంగా పొందవచ్చు" అని TON ఫౌండేషన్ తెలిపింది. "టెలిగ్రామ్ లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త సర్వీసుతో మీరు ఇకపై అతిపెద్ద లేదా పొడవైన వాలెట్ అడ్రసులను నమోదు చేయాల్సిన అవసరం లేదు మరియు నిర్ధారణల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు" అని ఫౌండేషన్ ఫీచర్‌ను ప్రకటిస్తూ ట్వీట్‌లో పేర్కొంది.టెలిగ్రామ్ సంస్థ ఇటీవల కొత్తగా మరొక అప్ డేట్ ను కూడా ప్రకటించింది. వీటిలో మ్యూట్ డ్యూరేషన్, యానిమేటెడ్ ఎమోజీలు మరియు మెరుగైన మెసేజ్ ట్రాన్సలేషన్లతో సహా అనేక కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. అలాగే కస్టమ్ నోటిఫికేషన్ సౌండ్స్ ఫీచర్ తో వినియోగదారులు ఏదైనా సౌండ్‌ని నోటిఫికేషన్ టోన్‌గా మార్చడానికి అనుమతిస్తుంది. ఇది యాప్‌లో కస్టమ్ అలర్ట్‌లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు.

Post a Comment

0 Comments