Ad Code

ఎవరికి తెలియకుండా వాట్సాప్ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్ ?


వాట్సాప్ కొత్తగా మరో ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల వాట్సాప్‌లో చాలా రకాల గ్రూప్స్ ఉంటాయి. వారికి ఇష్టం లేకపోతే వాటి నుండి ఎగ్జిట్ కావచ్చు. కానీ ఆ విషయం గ్రూప్‌లోని మిగతా సభ్యులకు తెలుస్తుందని కొంత మంది వాటి నుంచి నిష్క్రమించడానికి వెనుకాడుతుంటారు. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకొడానికి వాట్సాప్, వినియోగదారుల కోసం కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తుంది. వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo ప్రకారం వినియోగదారులు గ్రూప్ నుంచి నిష్క్రమించిన తర్వాత వినియోగదారు, గ్రూప్ అడ్మిన్‌లకు మాత్రమే ఎగ్జిట్ అయిన విషయం తెలిసేలా ఫీచర్ రానుంది. దీని వలన గ్రూప్ నిష్క్రమణ విషయం గ్రూప్‌లోని మిగతా సభ్యులకు తెలియదు. ప్రస్తుతం ఎవరైనా గ్రూప్ నుండి నిష్క్రమించినప్పుడు, నోటిఫికేషన్‌ను ద్వారా ఇతర సభ్యులకు అలాగే అడ్మిన్‌లకు కనిపిస్తుంది. కమ్యూనిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీంతో పాటు గ్రూప్ ఎగ్జిట్ కు సంబంధించిన కొత్త ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. ప్రస్తుతానికి ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయినప్పటికి త్వరలో ఈ ఫీచర్‌ను వినియోగదారులను అందించనున్నట్లు WhatsApp FAQ పేజీలో పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu