Ad Code

సీఎన్‌జీ కార్లకి పెరుగుతున్న డిమాండ్‌ ?


పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగింది. అయితే ఈ వాహనాలలో కూడా కొన్ని ప్రాథమిక సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో చాలామంది సీఎన్‌జీ కార్లపై మొగ్గుచూపుతున్నారు. ఏప్రిల్ నెలలో సీఎన్‌జీ వ్యక్తిగత, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు రెండింతలు పెరిగాయి. అంతేకాదు సీఎన్‌జీ కారు మెయింటనెన్స్‌ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ పెట్రోల్ ధర రూ.105 నుంచి 110 మధ్య ఉంది. సీఎన్‌జీ కారు కిలోమీటరుకు రూ.2.1 ఖర్చవుతుండగా పెట్రోల్ కారు ఖర్చు 5 రూపాయలకు చేరువలో ఉంది. దీనివల్ల సీఎన్‌జీ కార్లకి డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. మారుతి సుజుకి కంపెనీ వ్యాగన్ ఆర్, ఈకో, డిజైర్ వంటి సీఎన్‌జి ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాలకి డిమాండ్ విపరీతంగా ఉంది. వచ్చే 3 నంచి 5 ఏళ్లలో మొత్తం విక్రయాల్లో సీఎన్‌జీ కార్ల వాటా దాదాపు 20 శాతానికి చేరుకోవచ్చని టాటా మోటార్స్ అంచనా వేసింది. అంతేకాదు తన సీఎన్‌జీ మోడల్‌ హ్యాచ్‌బ్యాక్ కాంపాక్ట్ సెడాన్‌ని విడుదల చేయనుంది. హ్యుందాయ్ ఇండియా ప్రారంభ స్థాయిలో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తోంది. అలాగే దేశంలో కొత్త సిఎన్‌జి స్టేషన్లను ప్రారంభించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. గత రెండేళ్లలో దేశంలోని 250 నగరాల్లో సీఎన్‌జీ స్టేషన్ల సంఖ్య రెండింతలు పెరిగి 3800కి చేరుకుంది. వచ్చే రెండేళ్లలో దేశంలోని 300 నగరాల్లో దాదాపు 10,000 సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ నెలలో టాప్-5 మోడల్ గురించి మాట్లాడితే.. మారుతి సుజుకి 10037 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లని విక్రయించింది. మారుతికి చెందిన ఈకో 4084 యూనిట్లు, మారుతీకి చెందిన డిజైర్ 2967 యూనిట్లు, హ్యుందాయ్ ఆరా 2466 యూనిట్లు, టాటా టియాగో 2451 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu