ఐప్యాడ్ యూజర్లకు కొత్త వాట్సాప్ !
Your Responsive Ads code (Google Ads)

ఐప్యాడ్ యూజర్లకు కొత్త వాట్సాప్ !


వాట్సాప్ కొత్త వెర్షన్ తీసుకొస్తోంది. ఐప్యాడ్ యూజర్లకు మాత్రం వాట్సాప్ అందుబాటులో లేదు. ఎప్పటినుంచో ఐప్యాడ్ యూజర్లు కూడా తమకు ప్రత్యేకంగా వాట్సాప్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా మెటా యాజమాన్యం వాట్సాప్ ఐప్యాడ్ వెర్షన్ ఇప్పటివరకూ రిలీజ్ చేయలేదు. గతంలోనూ వాట్సాప్ ఐప్యాడ్ యాప్ టెస్టింగ్ చేస్తున్నట్టు నివేదికలు వచ్చాయి. కానీ, ఇప్పటివరకూ ఆ టెస్టింగ్ పూర్తి వెర్షన్ రూపొందించలేదు. అయితే, వాట్సాప్ మల్టీ డివైస్ 2.0లో వర్క్ చేస్తోంది. ఐప్యాడ్ యూజర్ల డిమాండ్ మేరకు ఐప్యాడ్ వెర్షన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. మల్టీ-డివైజ్ సపోర్టు యూజర్లలో నాలుగు వేర్వేరు డివైజ్‌ల నుంచి ఒకే అకౌంట్లో లాగిన్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే వాట్సాప్ లో ఇప్పటికీ యూజర్లు తమ రెండు వేర్వేరు ఫోన్‌ల నుంచి ఒకే అకౌంట్‌తో లాగిన్ అయ్యేందుకు అనుమతించదు. ఐప్యాడ్ యూజర్లలో యాప్ ఐప్యాడ్ వెర్షన్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. వాట్సాప్ ఫీచర్‌లను ట్రాకింగ్ వెబ్‌సైట్ Wabetainfo ప్రకారం.. మల్టీ-డివైస్ 2.0 అదనపు మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ (iPad/Android టాబ్లెట్ WhatsApp) అందిస్తోంది. WhatsAppకి లింక్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. భవిష్యత్తులో ఐప్యాడ్ యూజర్ల కోసం వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌తో పాటు యాప్ ఫోన్ వెర్షన్ మాదిరిగానే ఫీచర్లను అందిస్తుందా లేదా అనేది రివీల్ చేయలేదు. ఐప్యాడ్‌తో పాటు, వాట్సాప్ MacOS కోసం స్పెషల్ వెర్షన్‌లో కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ప్రస్తుతం టాబ్లెట్‌లలో వాట్సాప్ ఆప్టిమైజ్ చేయలేదు. టాబ్లెట్‌లలో WhatsAppని వినియోగించుకోవచ్చు. ఇప్పటికీ మీ టాబ్లెట్‌లోని OS ఆధారంగా యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి Whatsapp మొబైల్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాదాపు మూడేళ్లపాటు ఈ ఫీచర్‌పై పనిచేసిన తర్వాత.. వాట్సాప్ మల్టీ-డివైస్ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ప్రస్తుతం యూజర్లను ఒకే అకౌంటును నాలుగు వేర్వేరు అకౌంట్ల నుంచి వాట్సాప్‌ని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. అయితే, ఒక ప్రైమరీ ఫోన్ మాత్రమే కలిగి ఉండి.. మిగిలిన డివైజ్‌లు.. మీ ల్యాప్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ఈ ఫీచర్‌పై వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ.. మల్టీ-డివైస్ అంటే.. మీ ఫోన్‌ను కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎప్పుడంటే అప్పుడు వాట్సాప్ కనెక్ట్ కావొచ్చు. ప్రస్తుత పబ్లిక్ వెర్షన్‌లు వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ పోర్టల్‌లో అందుబాటులో ఉందని ప్రతినిధి చెప్పారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog