Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో ఐఫోన్ పై భారీ డిస్కౌంట్‌ !


ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై గతంలో కన్నా ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది. షావోమీ, రియల్‌మీ, సాంసంగ్, ఒప్పో, వివో లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాదు... యాపిల్ ఐఫోన్లపైనా  భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రిలీజ్ అయినప్పుడు ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్ ధర రూ.64,900 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.69,900. హైఎండ్ వేరియంట్ ధర 256జీబీ మోడల్ ధర రూ.79,900. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 64జీబీ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.45,999. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 64జీబీ, 128జీబీ వేరియంట్లు సుమారు రూ.25,000 తక్కువకే లభిస్తున్నాయి. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.1,538 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్  6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 11 యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 3,110 ఎంఏహెచ్. 12+12 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా కెపాసిటీ ఉంది. రియర్ కెమెరాలో పోర్ట్‌రైట్, అడ్వాన్స్‌డ్ బొకే, డెప్త్ కంట్రోల్, పనోరమా, నైట్ మోడ్, ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్, బరస్ట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఐఓఎస్ 14.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 కలర్స్‌లో అందుబాటులో ఉండటం విశేషం. వైట్, పర్పుల్, గ్రీన్, యెల్లో, బ్లాక్, రెడ్ కలర్స్‌లో కొనొచ్చు. బాక్యులో పవర్ అడాప్టర్, ఇయర్‌పాడ్స్ ఉండవు. వీటిని వేరుగా కొనాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ 11 మోడల్‌తో పాటు ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐప్యాడ్, యాపిల్ వాచ్, మ్యాక్‌బుక్, ఎయిర్‌పాడ్స్ పైనా ఆఫర్స్ లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu