Ad Code

స్టార్టప్‌లకు బంపర్ ఆఫర్ !


ఒప్పో ఇండియా ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్‌ని లాంఛ్ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా, భారతదేశంలో మొత్తం ఆవిష్కరణల సంస్కృతిని వేగవంతం చేయడం, పరిశ్రమలో తదుపరి దశలో భారీగా సాంకేతిక మార్పును తీసుకువచ్చే సత్తా ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించడం ఒప్పో లక్ష్యంగా నిర్దేశించుకుంది. బలమైన భాగస్వామ్యంతో ఒప్పో తన ఎలివేట్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని ఆసక్తికరమైన ఆలోచనతో యువ స్టార్టప్‌లు ఆవిష్కరణలను వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించేందుకు సహకరిస్తుంది. ఒప్పో ప్రొడక్టులు, వనరులు, పంపిణీ, పెట్టుబడి అవకాశాలతో సహా వారి ఆవిష్కరణలను కొనసాగించేందుకు వృత్తిపరమైన గైడెన్స్‌, సపోర్ట్‌, ఆపర్చునిటీలను ఈ కార్యక్రమం ద్వారా అందిస్తుంది. సాంకేతిక మార్పులను తీసుకురావాలని ఒప్పో, మైక్రోసాఫ్ట్ చూస్తున్నాయి. ఈ తరుణంలోనే స్టార్టప్ పోటీలను ప్రకటించాయి. ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ కింద రెండు టెక్ దిగ్గజాలు స్టార్టప్ లకు మార్గదర్శకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంకురాలకు సహకారం అందించేలా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఒప్పో ఇండియా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. యాక్సెసిబుల్ టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ కోసం పనిచేసే స్టార్టప్ లు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టార్టప్ ల కోసం మైక్రోసాఫ్ట్ కంట్రీ హెడ్-ఇండియా మధురిమా అగర్వాల్, ఒప్పో ఇండియా వీపీ, ఆర్ అండ్ డీ తస్లీమ్ ఆరిఫ్ నేతృత్వంలోని నిపుణులతో కూడిన జాబితాను వెల్లడించారు. ఎంపిక చేసిన టాప్ 10 స్టార్టప్ లు ఆగస్టు 2022 లో జరిగే ఈవెంట్ లో తమ ప్రతిపాదనలను జ్యూరీకి సమర్పించే అవకాశాన్ని పొందుతాయి. అంతే కాకుండా ఈ 10 స్టార్టప్‌లు ఆర్ అండ్ డీ సౌకర్యాల యాక్సెస్ కోసం ఒప్పోతో సహకారానికి అర్హులు. గ్లోబల్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లోకి గెలిచిన మొదటి మూడు కంపెనీలకు ప్రపంచస్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక్కొక్కరికి 46,000 డాలర్ల గ్రాంట్ లను గెలుచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పోటీలో పాల్గొనే వారు అజూర్ క్రెడిట్ లకు అర్హులని ప్రకటించారు. అర్హత కలిగిన స్టార్టప్‌లు గరిష్టంగా 150,000 డారల్ల విలువైన అజూర్ క్రెడిట్‌లను, వ్యాపార, సాంకేతిక నిపుణుల నుండి మార్గదర్శకత్వంతో పాటు ప్రపంచ స్థాయి డెవలపర్‌కు యాక్సెస్‌ను పొందవచ్చు. ఒప్పో ద్వారా ఇంతటి భారీ కార్యక్రమానికి నాయకత్వం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఒప్పో ఇండియా, ఉపాధ్యక్షుడు, భారతీయ ఆర్ &డిహెడ్, తస్లీమ్ ఆరీఫ్ అన్నారు. స్టార్టప్‌ల కోసం ఓప్పో ఇండియా మరియు మైక్రోసాఫ్ట్ మధ్య సహకారం దేశంలోని స్టార్టప్‌ల ఆవిష్కరణతో పాటు వ్యవస్థాపక శక్తిని పెంచడానికి సహయ పడుతుందని మైక్రోసాఫ్ట్ కంట్రీ హెడ్ అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu