Ad Code

టాటా నుంచి ఎలక్ట్రిక్ కార్గో వెహికల్


టాటా మోటార్స్‌ ఏస్‌ మినీ ట్రక్‌ను ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈవోజెన్‌ పవర్‌ట్రైన్‌తో 27 కిలోవాట్‌ (36 హెచ్‌పీ) మోటార్‌ను పొందుపరిచింది. దీనిని ఒకసారి చార్జింగ్‌ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 39వేల యూనిట్ల ఏస్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల సరఫరాకు ఇప్పటికే ఆర్డర్‌ దక్కించుకుంది. అమెజాన్, బిగ్‌బాస్కెట్, సిటీ లింక్, డాట్, ఫ్లిప్‌కార్ట్, లెట్స్‌ ట్రాన్స్‌పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ కంపెనీలకు ఏస్‌ ఎలక్ట్రిక్‌ను సరఫరా చేయనుంది. కాగా, ఏస్‌ మినీ ట్రక్‌ను కంపెనీ 2005లో భారత్‌లో పరిచయం చేసింది. 20 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిఫికేషన్ ప్రయాణంలో గణనీయమైన పురోగతిని సాధించింది. చంద్రశేఖరన్ “మేము ఇప్పటికే కార్ల విభాగంలో అనేక మోడళ్లను ప్రారంభించాం. ప్యాసింజర్ కార్లలో ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నామని అన్నారు. “వాణిజ్య వాహనాలలో విజయవంతంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాం. ఆ విభాగంలో భారీ ఆమోదాన్ని పికప్‌ను చూస్తున్నాం. ఇ-కార్గో మొబిలిటీకి మారుతున్న రోజుని సూచిస్తుంది. కేవలం ఒక ఏస్ ప్లాట్ ఫాం మాత్రమే కాకుండా ిత కేటగిరీల్లోనూ దేశవ్యాప్తంగా మార్కెట్ల చేయాలని చూస్తున్నాం. భారతదేశం అంతటా అనేక మంది పారిశ్రామికవేత్తలు, మిలియన్ల మందికి ఈవీలు ఆశాజ్యోతి” అని చంద్రశేఖరన్ అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu