Ad Code

ఏసీలు - కరెంట్ బిల్లు - టిప్స్


వేసవిలో ఎయిర్ కండిషనర్ల వాడకం గణనీయంగా పెరిగింది. సమ్మర్‌లో వేడిని తట్టుకోవడానికి ఏసీలు బెస్ట్ ఆప్షన్. అయితే ఇవి చాలా ఖరీదైనవి.ఏసీలకు కరెంట్ కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. దీంతో కరెంట్ బిల్లు ఎంతోకొంత పెరుగుతుంది. ఇలా సమ్మర్ సీజన్ మొత్తం విద్యుత్ బిల్లు పెరగవచ్చు. అయితే ఎయిర్ కండీషనర్‌లు వాడేవారు కొన్ని టిప్స్‌తో కరెంటు బిల్లులు తక్కువ చేసుకోవచ్చు.  ఎయిర్ కండీషనర్‌లను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ప్రతి సీజన్ ప్రారంభంలో లేదా సంవత్సరానికి ఒకసారి ఏసీలను పూర్తిగా చెక్ చేయాలి. అవసరాన్ని బట్టి ఎక్కువసార్లు కూడా సర్వీసింగ్ చేయించవచ్చు. ఈ ప్రక్రియలో ఏసీలోని కాయిల్స్‌ను నిపుణులు శుభ్రం చేస్తారు. వోల్టేజ్ కనెక్షన్స్, కూలింగ్ లెవల్ వంటివన్నీ చెక్ చేస్తారు. దీనివల్ల ఏసీలు వర్కింగ్ కండిషన్‌లో పనిచేస్తాయి. ఇలా వాటి పనితీరు పెరిగి విద్యుత్ వినియోగం ఎంతోకొంత తగ్గుతుంది. విండో ఏసీలలో లీకేజీ అనేది తరచుగా వచ్చే సమస్య. కొన్ని సమయాల్లో ఏసీ, విండో ఫ్రేమ్‌ల మధ్య ఖాళీలు ఉంటాయి. ఇది కూలింగ్ కెపాసిటీని దెబ్బతీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులు mSeal వంటి సీలెంట్‌తో వీటిని సీల్ చేయవచ్చు. విద్యుత్తు ఆదా కోసం ఎయిర్ కండీషనర్‌లను ఆన్‌చేసి, మధ్యలో కాసేపు ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఏసీని ర్యాండమ్‌గా స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేయడానికి టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. కట్-ఆఫ్ టెంపరేచర్ వద్ద ఏసీ రన్ చేయండి. ఎయిర్ కండీషనర్‌ను కట్-ఆఫ్ టెంపరేచర్ వద్ద ఉంచడం అంటే.. గదిలో కూలింగ్ నిర్ణీత పరిమితికి చేరుకున్న వెంటనే  ఏసీ ఆఫ్ అయ్యేలా టెంపరేచర్ సెట్ చేయడం. ఉదాహరణకు మీరు 24 డిగ్రీల కటాఫ్ టెంపరేచర్‌తో ఏసీ  పనిచేసేలా సెట్ చేస్తే ఉష్ణోగ్రత 24 డిగ్రీలకు చేరుకున్న వెంటనే ఏసీ ఆఫ్ అయిపోతుంది. గది ఉష్ణోగ్రత పెరుగుతోందని గుర్తించినప్పుడు ఆటోమెటిక్‌గా కంప్రెసర్‌ ఆన్ అయ్యి ఏసీ పనిచేస్తుంది.  ఎయిర్ ఫిల్టర్‌లను శుభ్రం చేయండి ఏసీ లలోని ఎయిర్ ఫిల్టర్‌లు HVAC సిస్టమ్ వద్దకు ధూళిని చేరనివ్వవు. దీంతో ఏసీ వినియోగం సాఫీగా ఉంటుంది. అయితే ఎయిర్ ఫిల్టర్లు డస్ట్‌ను బ్లాక్ చేస్తాయి కాబట్టి.. అవి మురికిగా ఉంటాయి. వీటిని ప్రతిసారి శుభ్రం చేయాలి. ఫిల్టర్ల దుమ్ము దులిపి నీటితో కడిగితే సరిపోతుంది. 

Post a Comment

0 Comments

Close Menu