Ad Code

ఆఫీస్‌కు వచ్చి పనిచేయండి : టిమ్ కుక్


మే 23 నుంచి కార్యాలయాలకు రావాలని వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని యాపిల్ సంస్థ ఉద్యోగులను కోరింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఉద్యోగులను కోరుతూ రిటన్ టూ ఆఫీస్ పాలసీని వెల్లడించారు. కంపెనీ విధానాన్ని 76 శాతం మంది యాపిల్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. యాపిల్ పాలసీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కంపెనీని వీడి పనిలో మరింత వెసులుబాటు కల్పించే మరో టెక్ కంపెనీలో చేరాలని వారు యోచిస్తున్నారని సోషల్ నెట్‌వర్క్ యాప్ బ్లైండ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 మధ్య 652 మంది యాపిల్ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించామని బ్లైండ్ పేర్కొంది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి వీరంతా ఇంటి నుంచి పనిచేస్తున్నారని తెలిపింది. ఆఫీసు నుంచి పనిచేయాల్సి వస్తే తమకు రవాణా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెప్పారు. కొందరు ఉద్యోగులు యాపిల్‌ను వీడి మరింత వెసులుబాటు కల్పించే ఇతర టెక్ కంపెనీల్లో కొలువులు చూసుకుంటామని చెప్పారని బ్లైండ్ వెల్లడించింది. మరోవైపు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సైతం ఉద్యోగులను ఆఫీసుల బాట పట్టించేందుకు సన్నద్ధమైంది. ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉద్యోగులకు ఇస్తూ వారిని ఆఫీసులకు రప్పించేందుకు కసరత్తు సాగిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu